వై.వి యు డాక్టరేట్ అందుకున్న రమేష్ నాయుడుకు జనసేన తరఫున అభినందనలు

  • పులికొండ గ్రామవాసి బండమీద రమేష్ నాయుడుకి రసాయన శాస్త్రంలో వై.వి. యూ డాక్టరేట్ మాకు మా గ్రామానికి చాలా సంతోషం.. సిజి రాజశేఖర్

పత్తికొండ: పులికొండ గ్రామవాసి బండమీద రమేష్ నాయుడుకి రసాయన శాస్త్రంలో వై.వి. యూ డాక్టరేట్ మాకు మా గ్రామానికి చాలా గర్వకారణమని.. జనసేన నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. మన పత్తికొండ నియోజకవర్గంలో, పత్తికొండ మండలం, పులికొండ గ్రామానికి, చెందిన, బండమీద కీ.శే వెంకట రామయ్య, రామేశ్వరిలకు ముగ్గురు సంతానం. వారిలో మొదటి కుమారుడు రమేష్ నాయుడు యోగి వేమన విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ పరిశోధకులు బండమీద రమేష్ నాయుడుకి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. రసాయన శాస్త్ర శాఖ సహ ఆచార్యులు డా. కట్టా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ మెతడాలజిస్ టు ఆక్సెస్ ఇమైన్స్, హెటిరో సైక్లిక్స్, బైఅరైల్స్, కార్బోమేట్స్, అండ్ ఫ్యాటీ ఆసిడ్ ఎస్టర్స్” అనే అంశముపైన పరిశోధన చేసి రూపొందించిన సిద్దాంత గ్రంథాన్ని రమేష్ నాయుడు విశ్వ విద్యాలయ పరీక్షల విభాగానికి సమర్పించారు. వై వి యు ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ మార్గదర్శకం మేరకు నియమితులైన నిపుణుల బృందం, పరిశోధకుడు రమేష్ నాయుడు రూపొందించిన పరిశోధన గ్రంథం అధ్యయనం చేసి డాక్టరేట్ అర్హత ఉందంటూ ధృవీకరించారు. ఈ మేరకు డాక్టరేట్ ప్రొసీడింగ్స్ ను వై.వి.యు పరీక్షల నిర్వహణాధికారి ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర్ రెడ్డి జారీ చేశారు. రమేష్ నాయుడు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు. మరియు ఇతని పరిశోధనలు (24)ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. రసాయన శాస్త్ర విభాగములో డాక్టరేట్ అందుకున్న రమేష్ నాయుడుని ఉపకులపతి ఆచార్య చింత సుధాకర్, కుల సచీవులు ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ప్రధానాచార్యులు ఎస్. రఘునాథరెడ్డి, ఉప ప్రధానాచార్యులు ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆచార్యులు, అధ్యాపకులు, స్కాలర్లు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధు మిత్రులు అభినందించారు. పులికొండ గ్రామం లో మొదటగా పి.హెచ్.డి అవార్డ్ అందుకున్న వ్యక్తి రమేష్ నాయుడు మా పులికొండ వాసి కావడం విశేషం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు. అలాగే పులికొండ గ్రామంలో అందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసారు.