పాడేరు జనసేన ఐటి వింగ్ సమావేశం

పాడేరు: పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ ఐటి సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి వివిధ మండలాల ఐటి కో ఆర్డినేటర్స్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐటి కో ఆర్డినేటర్స్ ఇన్చార్జ్ అశోక్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ సోషల్ మీడియా మరియు ఐటి కో ఆర్డినేటర్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జనసైనికులందరూ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాస్తవికతను తెలియజేసే విధంగా కార్యాచరణ చేయాలని, అలాగే మండలాల వారిగా సోషల్ మీడియా విభాగాలను నియమించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసామని అన్నారు. నియోజకవర్గ పరిధిలో కొయ్యురు అత్యధిక పెద్ద మండలం కనుక అక్కడ సుమారు 12 మంది సభ్యులతో కూడిన సోషల్ మీడియా మరియు ఐటి విభాగం ఏర్పాటు చేశామని, ఇప్పటినుంచి పార్టీ అదేశాలమేరకు ఇన్చార్జ్ డా. గంగులయ్య గారికి సహకరిస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మండలాల వారిగా పలువురు జనసైనికులకు కీలక బాధ్యతలు అప్పగించిన ఇన్చార్జ్ గంగులయ్య మాట్లాడుతూ.. ఏ పార్టీకి లేనంత జనసేన పార్టీకి సోషల్ మీడియా విభాగం అధిక బలమని, అలాగే గిరిజన ప్రజలకు వాస్తవ రాజకీయాలు, నిజాయితీ రాజకీయ వ్యవస్థ అయిన జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు మారుమూల పల్లెల్లో కూడా విస్తరింపజేస్తూ పార్టీ నిర్మాణానికి మీదైన పాత్ర పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో కొయ్యురు మండల నాయకులు బుజ్జిబాబు, ప్రకాష్, కొయ్యం బాలు, సురేష్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.