క్రాస్ బౌ రైఫిల్ షూటింగ్ విజేతలను అభినందించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ఆ: గ్రా ఏకలవ్య స్టేడియంలో జరిగిన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సన్సద్ ఖేల్ స్పర్థ క్రీడా పోటీలు ఇటీవల ఆగ్రాలో నిర్వహించగా.. క్రాస్ బౌ రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఏడు రాష్ట్రాల నుండి సుమారుగా 200 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. నేషనల్ లెవెల్ బాలురు అండర్ 14, అండర్ 20, క్రాస్ బౌ షూటింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం గొర్రిపూడికి చెందిన జనసైనికుడు గండి శివకుమార్ కుమారులు గండి సత్యనారాయణ యు-20 (585/600), గండి కార్తికేయ యు–14 (592/600) రికార్డ్ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, కేంద్ర న్యాయశాఖమంత్రి ఎస్.పి. సింగ్ బఘెల్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వీరిని వారి స్వగ్రామమైన గొర్రిపూడికి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ వెళ్ళి దుస్సాలువతో సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలియచేసి, తల్లి తండ్రులను అభినందించారు.