గొర్రిపూడిలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం

కాకినాడ రూరల్: జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా నేడు కరప మండలం, గొర్రిపూడి గ్రామంలో స్థానిక నాయకులు, అనుకుల రాంబాబు, పుణ్యమంతుల అన్నవరం, గండి యారీష్, నల్లే ప్రసన్న ఆధ్వర్యంలో శనివారం ప్రజా సమస్యలు తెలుకోవడానికి చిన్న వీధి, బసవేశ్వర స్వామి గుడి వీధి, మెయిన్ స్కూల్ వీధి ప్రాంతాలలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు బీసీపేటలో స్మశాన వాటిక లేదని స్థానికులు ఇంటింటికి చందాలు వేసుకుని స్మశానం నిర్మాణం చేసుకుంటున్నామని, ప్రభుత్వ సహకారమ్ లేదని, ఇదివరకు పంచాయతీ ద్వారా చేపల మార్కెట్ నిర్వహించడం జరిగేదని, ఇప్పుడు లేదని, ఆ ప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు నియలంగా మారిందని, పశువుల ఆసుపత్రి ఇదివరకు ఉండేదని, ఇప్పుడు లేదని, నిధులు లేవని సచివాలయం, ఆర్.బి.కే, సెంటర్ ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారని, ఆర్.బి.కే సెంటర్ వల్ల రైతులకి ఎటువంటి ఉపయోగం లేదని, రోడ్లు సరిగా లెవని, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సదుపాయాలు లేవని, విద్యుత్ సబ్ స్టేషన్ శాంక్షన్ అయి నాలుగు సంవత్సరాలు అయిన ఇంకా బేస్మెంట్ స్థితి లోనే ఆగిపోయిందని, నిరూపయోగంగా ప్రభుత్వ వాటర్ ప్లాంట్ ఉందని తెలిపారు. సమస్యలు పరిష్కారంకై అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని నానాజీ ప్రజలకి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.