శ్రీశ్రీశ్రీ మడితాడమ్మ, పెద్దక్కమ్మ, చిన్నక్కమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో మడితాడు గ్రామపంచాయితీలో వెలసిన శ్రీశ్రీశ్రీ మడితాడమ్మ, పెద్దక్కమ్మ, చిన్నక్కమ్మ వారి రాత్రి తిరుణాల సందర్భంగా మంగళవారం వివిధ రకాల సంస్కృతి సంప్రదాయం ప్రకారం చాందినీబండ్లు, చక్కభజనలు, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా చుట్టు పక్కల గ్రామస్థులు అందరూ కలిసి ఘనంగా జాతర మహోత్సవం నిర్వహించారు. అలానే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరడం జనసేన నాయకులు రామ శ్రీనివాస్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, గ్రామపెద్దలు, జనసైనికులు, స్థానికులు, గ్రామస్థులు, యువకులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.