టీడీపీ రిలే దీక్షలకు పిఠాపురం జనసేన సంఘీభావం

  • పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మతో కలిసి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని నినాదాలు చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం, చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పిఠాపురం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు మంగళవారం జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సీనియర్ రాజకీయ నాయకులు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా అరెస్ట్ చేయడం చట్టాన్ని అపహస్యం చేయడమేనని తెలిపుతూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయనే కేసులో రూ.371 కోట్లు పక్క దారి పట్టించారనేది ప్రధాన ఆరోపణగా నిర్ధారణ కాకుండానే అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని, కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచివి కావు అని ప్రభుత్వానికి హితువు పలుకుతూ మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం చిత్తశుద్ధితో టీడీపీకి మద్దతుగా ఉంటామని, కలిసి ఎన్నికల్లో పోరాడి ఈ సైకో ప్రభుత్వంను గద్దె దింపుతాం అని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కక్షా రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ ని వైజాగ్ లో ఇబ్బంది పెట్టడం, రోడ్డు మీదకు రాకుండా చేయడం లాంటి పనులు మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది అని తెలుపుతూ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులతో పాటుగా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.