తుమ్మలపాలెం గ్రామ సమస్యలపై ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎంపీటీసీ పోలిశెట్టి తేజ

*అడిగిన వెంటనే దశాబ్దాలుగా వాడుకలో ఉన్న స్మశానవాటికను యాదవిధిగా వాడుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు.
*శిదిలావస్థకు చేరుకున్న రెండు విటిపిఎస్ కెనాల్ వంతెనలను.. విటిపిఎస్ యాజమాన్యంతో మాట్లాడి పునర్నిర్మాణం చేసేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
*తుమ్మపాలెం గ్రామం జాతీయ రహదారి ప్రక్కనే ఉన్నందువల్ల రాత్రిపూట రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారని తెలియజేయటంతో వెంటనే ప్రస్తుతానికి యుద్ధప్రాతిపతికన జాతీయ రహదారిపై సిగ్నల్ లైట్లు ఏర్పాటు చెయ్యాలని గౌరవ ఎంపీపీ కి మరియు అధికారులను సబ్ కలక్టర్ ప్రవీణ్ చంద్ కోరారు.
*అదేవిధంగా తుమ్మపాలెం గ్రామంలో వున్న డ్రైనేజీ సమస్యలను మరియు మౌలిక సదుపాయలు గురించి అడిగి తెలుసుకున్నారు.
తమ గ్రామ సమస్యలను ఎంతో ఓపికతో విని సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని వినతిపత్రం స్వీకరించిన ఎన్టీఆర్ జిల్లా సబ్ కలక్టర్ ప్రవీణ్ చంద్ కు పోలిశెట్టి తేజ కృతజ్ఞతలు తెలియజేసారు.