గంటి పెదపూడి జనసేన ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులపై నిరసన

విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించడం, జనసేన పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ వైకాపా ప్రభుత్వ తీరుపై పి.గన్నవరం మండలం, గంటి పెదపూడి గ్రామ జనసైనికులు నిరసన చేపట్టారు. ఈ మేరకు గంటి పెదపూడి గ్రామశాఖ ఆధ్వర్యంలో జనసేన పార్టీ యువత నిరసన చేపట్టి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జనసేన పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.