జగ్గయ్యపేటలో నిరసన సెగ

  • జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అరెస్టును ఖండిస్తున్నాం
  • జగ్గయ్యపేటలో జనసేన దిమ్మ కూల్చిన వారిపై చర్య తీసుకోవాలి
  • ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి శివరామకృష్ణ

నూజివీడు, జగ్గయ్యపేటలో జనసేన జెండా దిమ్మ కూల్చటాన్ని నిరసిస్తూ, దుండగుల పై చర్య తీసుకోవాలని, దిమ్మ మళ్ళీ తిరిగి నిర్మించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ప్రాంతీయ కమిటీ కో ఆర్డినేటర్ రావి సౌజన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిస మురళి, కిషోర్, ఇతర స్థానిక నాయకులని జగ్గయ్యపేట పోలీసులు అరెస్ట్ చేయటాన్ని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం జగ్గయ్యపేటలో దిమ్మ ఆవిష్కరణ కార్యక్రమం ఉందని తెలిసి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆదేశాలతో దుండగులు అర్ధ రాత్రి దిమ్మ కుల్చరని తెలిపారు. దీనికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ దిమ్మలకి, వైఎస్సార్ విగ్రహాలను అన్ని అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. కక్ష పూరిత వ్యవహారాలతో, శాంతియిత వాతావరణాన్ని చెడకొట్టి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి అల్లర్లు సృష్టించడానికి కొందరు ఇలాంటి ఘటనలకి పూనుకుంటున్నారు అని అన్నారు. దిమ్మ కూల్చిన వారిపై చర్య తీసుకోవాలని,ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని శివరామకృష్ణ కోరారు.