ప్రజా సేవే జనసేన సిద్ధాంతం: నలిశెట్టి శ్రీధర్

అనంతసాగరంలోని పడమటి కంభంపాడు గ్రామంలో పార్టీ నాయకులు రవి ఉదయగిరి ఆద్వర్యంలో జరిగిన హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ సంస్థకి సన్మాన కార్యక్రమంకి ముఖ్యఅతిధిగా వచ్చిన ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, భారత్ ని హెల్పింగ్ హార్ట్స్ సంస్థ అధ్యక్షులు వల్లూరు శ్రీనివాస్ చౌదరి మరియు సంస్థ సభ్యులు పూల బొకేతో, శాలువా కప్పి సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ సంస్థ డైరెక్టర్ వల్లూరు శ్రీనివాస్ చౌదరి సేవా కార్యక్రమాలని జనసేనాని శ్రీధర్ కొనియాడారు. మీకు ఎల్లవేళలా మా మద్దతు కూడా ఉంటుంది అని హామీ ఇచ్చారు. అటు తరువాత జనసేన పార్టీ ఆత్మకూర్ నియోజకవర్గ తరపున హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లూరు శ్రీనివాస్ చౌదరిని శ్రీ నలిశెట్టి శ్రీధర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ భరత్, రెడ్డి సునీల్, నాగరాజు యాదవ్, అనిల్ రాయల్, రాకేష్ యాదవ్ లు, అనంతసాగరం మండల ప్రధాన కార్యదర్శిలు వంశీ కృష్ణ యాదవ్, వేణు గుడిపాటి, ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి యాదవ్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు యాదవ్, వేణుగోపాల్ రాయల్, ఆత్మకూర్ రూరల్ నాయకులు ప్రవీణ్ రెడ్డి పేర్నాటి, సంగం మండల ప్రధాన కార్యదర్శి మదన్ యాదవ్ మర్రిపాడు ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.