ఘనంగా రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

రాజంపేట చిరంజీవి యువత అధ్యక్షులు గుగ్గిళ్ళ నాగార్జున ఆధ్వర్యంలో తండ్రికి తగ్గ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్ మరియు రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ సీనియర్ అభిమాని పోలిశెట్టి శ్రీనివాసులు, జిగిలి ఓబిలేసు, రాయచోటి చిరంజీవి యువత అధ్యక్షులు చిన్నారి జయరాం, హెబా బ్లడ్ అధ్యక్షులు ఫఠాన్అలీ, ఉపాధ్యక్షులు గోపికృష్ణ, రెడ్డిచర్ల నాగరాజా, అర్జున్ కుమార్, రవీంద్ర, మనోజ్ హేమంత్, గుగ్గిళ్ళ వెంకటేష్, బుస్సా నాగరాజా తదితరులు పాల్గొన్నారు.