కడప నగరంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

కడప: మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, ప్రముఖ కథానాయకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు బుధవారం కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మండుటెండలను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ జర్నలిస్ట్ ఉప్పు శ్రీకాంత్ మరియు కడప మెగా అభిమాని అబ్బన గారి రాజగోపాల్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు కడప టౌన్ రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షులు రాజశేఖర్ ఆధ్వర్యంలో మెగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అభిమానులకు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండ్రా రంజిత్, రాజశేఖర్ లు మాట్లాడుతూ అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎలా ఎదిగారో అదేవిధంగా రామ్ చరణ్ కూడా తన ప్రతిభ, పట్టుదల, కృషితో సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. మెగాస్టార్ తనయుడిగా ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పేద ప్రజలకు సహాయం అందించడంలోనూ, సామాజిక సేవా కార్యక్రమాలలోనూ దూసుకుపోతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచారని పేర్కొన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ మెగా అభిమానులను అలరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెగా సీనియర్ అభిమానులు శీర్ల నాగరాజు వర్మ, గణేష్, తోటా సుమన్, వంశీకృష్ణ, కుమార్ నాయక్, బాలు నాయక్, సుధీర్ నాయక్, మౌలాలి, గిరీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.