బనగానపల్లెలో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

బనగానపల్లె పట్టణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా రామ్ చరణ్ యువశక్తి బనగానపల్లె అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ అవుకు మండల నాయకులు అజిత్ రెడ్డి కొలిమిగుండ్ల మండల నాయకులు పృథ్వి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షుడు ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ మెగా కుటుంబం సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటుందని వారి స్ఫూర్తితోనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మెగా అభిమానులకు జనసైనికులకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ షాషావలికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాసిం, మహబూబ్, విక్రమ్, స్టాలిన్, వంశీకృష్ణ, శంకర్, మహేంద్ర, రవి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.