సప్లమెంటరీ ఫీజు రద్దు చేయాలి

  • ఆ భారం ప్రభుత్వమే మోయాలి
  • జనసేన ఇంచార్జి డార్ యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు, పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సప్లమెంటరీ ఫీజు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డా యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. ఆ భారం కూడా ప్రభుత్వమే మోయాలని ఈ సందర్బంగా తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 32% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అన్నారు. టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించడం, పేపర్ లో లీక్ కావడం విద్యార్థులపై ప్రభావం చూపాయి అన్నారు.71 స్కూల్ లలో ఒక్కరు కూడా పాస్ కాలేదని, అందులో 22 ప్రభుత్వ స్కూల్స్ ఉండటం సిగ్గుచేటని అన్నారు. భవిష్యత్ మార్గ దర్శకులైన ఉపాధ్యాయులకు సరియైన గౌరవం, సరియైన ప్రోత్సాహం అందించాలని, వారిని వైన్ షాపుల వద్ద కాపలాదారులుగా పెడితే రిసల్ట్ ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉపాధ్యాయులకి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రాధాన్యత పనులు వారికిచ్చి సముచిత స్థానం కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు లోకేష్, శ్యాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు గణేష్, నరసింహ, సోము, కార్యదర్శి గురుమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రకాష్, జనసైనికులు .