రంజాన్ అతిపవిత్రమైన పర్వదినం

రాజోలు, అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో క్రమ శిక్షణ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లాం సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం రాజోలు గ్రామంలో జనసేన పార్టీ రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు షేక్ ఇజ్రాయిల్ ఇంటిదగ్గర ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ మున్న, షా ఉద్దీన్, షేక్ బాబ్జి మొదలగు గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.