రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ మాసమంతా దైవ చింతనతో ఉపవాస దీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పండుగ చేసుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మానవాళికి సచ్ఛీలత, సన్మార్గం, క్షమ, దయాగుణాలను భోదించే దివ్య ఖురాన్ దివి నుంచి భువికి వచ్చిన పుణ్య కాలం రంజాన్ మాసమని విశ్వసిస్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికతల సారం ఈ వేడుక. మానవాళిలో దాన గుణం ఉండాలని రంజాన్ తెలియచెబుతోంది. స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ దానం చేయాలనే ప్రవక్త బోధన ఎంతో విలువైనది. ధనిక, పేద అనే తారతమ్యాలను మరచి మానవత్వంతో మెలగాలని.. చెడు వినరాదు, కనరాదు, మాట్లాడరాదు అనే హితవచనాలు సర్వదా అనుసరణీయం అని  పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.