ఎచ్చెర్ల జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీ, కృష్ణాపురం గ్రామంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈదేశం కోసం ఎంతోమంది జాతీయ నాయకులు ప్రాణత్యాగం చేసినారు. మనదేశం కోసం నాయకులు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. పూర్తి హక్కులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాలు 11నెలలు 18రోజులు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది.26-01-1950 తేదిన పూర్తి హక్కులతో గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం తయారు చేసికొని స్వేచ్ఛ స్వతంత్ర దేశంగా జాతీయ నాయకులు మనకు అందిచ గలిగారు. ఆరోజు జాతీయ నాయకులు త్యాగపలితమే ఈరోజు దేశం నలుమూలలా పండగలాగా జరుపుకుంటున్నాము. బావి భారత పౌరులగా పిల్లలు ఎదగాలని కోరుకుంటు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గోర్లె అప్పలనాయుడు, పోట్నూరు లక్ష్మునాయుడు, గోర్లె.పాపినాయుడు, ఉంగరాడ.లక్ష్మణ, కోరాడ సత్యం, లింగాల గోవిందా, నడుపూరు సత్యం, కలపర్తి‌ దుర్గారావు, స్కూల్ టీచర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.