మార్కాపురం నియోజకవర్గంలో జనసేన మండలాధ్యక్షుల సమీక్ష సమావేశం

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల (మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు) అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఈ సమీక్ష సమావేశంలో ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ ముందుగా మండల అధ్యక్షులకు అభినందనలు తెలియజేశారు. జనవరి నెల ఆఖరిలోపు మండల అధ్యక్షులు, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలతో సమన్వయమై గ్రామ కమిటి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సంయుక్త కార్యదర్శి N.V.సురేష్, మార్కాపురం టౌన్ అధ్యక్షులు షేక్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, కొనకనమిట్ల మండల అధ్యక్షులు అన్నం ప్రభావతి, పొదిలి మండల అధ్యక్షులు పెరుసోములు శ్రీనివాసులు, మార్కాపురం నాయకులు శిరిగిరి శ్రీనివాసులు పాల్గొన్నారు.