జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పొన్నలూరు జనసేన ఘన నివాళి

*స్వాతంత్ర ఉద్యమకారుడు, రాజకీయవేత్త మరియు సంఘసంస్కర్త అయినా డాక్టర్ “బాబు జగ్జీవన్ రామ్” 114 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన “పొన్నలూరు మండలం జనసేన పార్టీ” నాయకులు.
*ఈతరం మరియు రేపటితరం ప్రజలందరూ మహాత్ముల జీవిత చరిత్రలు తెలుసుకోవాలి,
*ఈ రాష్ట్ర ప్రభుత్వం మహాత్ముల జీవిత చరిత్రలు పుస్తకరూపంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించాలి.

పొన్నలూరు, స్వాతంత్ర ఉద్యమకారుడు, రాజకీయవేత్త మరియు సంఘసంస్కర్త అయిన డాక్టర్ “బాబు జగ్జీవన్ రామ్” 114 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన “పొన్నలూరు మండలం జనసేన పార్టీ” నాయకులు. మండలం జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” మాట్లాడుతూ… వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన అత్యంత గొప్ప నాయకుడు “బాబు జగజ్జీవన్ రామ్”, ఆయన వివిధ రకాల మంత్రి పదవులను మరియు ఉప ప్రధానమంత్రిగా కూడా మన దేశానికి సేవలు అందించారు, 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన “ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్” అనే సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు, 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు, ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశానికి ఎన్నో సేవలందించిన గొప్ప గొప్ప నాయకుల్లో “బాబు జగ్జీవన్ రామ్” ముందు వరుసలో ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులను, మహాత్ములను, మన దేశం కోసం వారి జీవితాలనే త్యాగం చేసిన వారందరి జీవిత చరిత్రలను పుస్తకరూపంలో ముద్రవేసి యావత్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుసుకొనే విధంగా చేయాలి, మహాత్ముల జీవిత చరిత్రలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో పొన్నలూరు జనసేన పార్టీ నాయకులు షేక్ ఖాజావలి, సుబ్రమణ్య నాయుడు, శ్రీను, తిరుమల్ రెడ్డి, వేణు, భాష, భార్గవ్, సాయి, మహబూబ్ బాషా, వీరయ్య, రిషి, గఫూర్ మొదలైన వాళ్ళు పాల్గొని నివాళులర్పించారు.