కొత్తకోడూరు బీచ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి, బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం, తోటపల్లి గూడూరు మండలాలకు ఆనుకొని సముద్రతీరం ఉంది. అయితే నెల్లూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త కోడూరు బీచ్ కి సరైన వసతులు లేవు. అదే విధంగా బీచ్ కి వెళ్లేడానికి మూడు కిలోమీటర్ల వరకు రోడ్డు గుంతలతో అస్తవ్యస్తంగా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు, అందులో పర్యాటక శాఖ మంత్రి రోజా నామమాత్రంగా అరె తప్ప ఈమె వల్ల పర్యాటక శాఖకు ఎలాంటి లాభం లేదు. మంత్రి రోజాకి పర్యాటకశాఖ ఇచ్చింది మా పార్టీ అధినేతను తిట్టడానికా లేదంటే జనసేన పార్టీ జనసేన సైనికులకి మధ్య వేలు చూపించడానికి, ఈ మధ్య వేలు చూపించడానికి అర్థం మాకైతే తెలీదు మరి ఈ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి రోజా పూర్తిగా వివరించాలి. ఆవిడ మధ్య వేలు చూపించబట్టి ఎన్నో అనర్ధాలు జరిగాయి. ఆ విషయం దేశవ్యాప్తంగా కూడా తెలుసు దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరి రోజా ఎందుకు ఆ మధ్య వేలు చూపించారు. మరి ఆవిడకి వేలు చూపటానికా పర్యాటకశాఖ ఇచ్చింది అనే విషయాన్ని స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్తకోడూరు బీచ్ పర్యటక శాఖలో ఒక భాగం బీచ్ ఎందుకు అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా బీచ్ కి వెళ్లే రోడ్డు మీద ఉన్న గుంటలని ఎందుకు పుడ్చలేక పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలని పూడ్చలేనప్పుడు మూడు రాజధానులు ఎలా కట్టాలి అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి వీటన్నిటికీ కూడా స్పష్టత ఇవ్వాలని మేము తెలియజేస్తూ, అదేవిధంగా కొత్తకోడూరు బీచ్ కి వెళ్లే రోడ్డు పైన ఉన్న గుంటలను పూద్చి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు విజయ్, శ్రీహరి, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.