“శతఘ్ని” సభ విజయవంతం

రాజానగరం, జనసేన పార్టీ రాజానగరం ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో రాజానగరంలో జరిగిన “శతఘ్ని” సభ రాజానగరం నియోజకవర్గంలోని మూడు మండలాలు 83 గ్రామాల నుండి విచ్చేసిన జనసైనికుల నినాదాలతో మారుమ్రోగిపోయింది. మీకు గ్రామ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, జిల్లా కమిటీ లేవని ప్రతిసారి మీ పార్టీని బలోపేతం చేసుకోండి అని ఎంతో వెటకారంగా ఉత్సాహపరిచిన విరిగిన ఫ్యాన్ రెక్కలకు ధన్యవాదాలు తెలుపుతూ మునుపెన్నడూ లేని విధంగా బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో ప్రతి గ్రామం నుండి నేటి నుండి ఎన్నికలలో గెలిచే వరకు అహర్నిశలు పార్టీ కోసం పనిచేసే జనసైనికులతో శతఘ్ని పేరునిచ్చి జనసేన పార్టీ ఒక గ్రూపును తయారు చేసింది. జనసేన అంటే నిరంతరం జనం అందుబాటులో ఉండే, జనానికి వెన్నుదన్నుగా నిలిచే పార్టీ. జనం సమస్యలు తెలుసుకుని నాయకునికి నివెదించడమే కాదు, జనసేన సిద్ధాంతాలు జనంలోకి తీసుకెళ్లేందుకు, అవినీతితో నిండిన అధికారపార్టీ చేస్తున్న నియోజకవర్గ, రాష్ట్ర దోపిడీని వెలికి తెచ్చేందుకు ప్రజలలో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు శతఘ్ని పని చేస్తుంది. ఈ సభకు వందల మంది జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైన్యం జనసేన పార్టీ గ్రామ మండల సమన్వయ కమిటీ మెంబర్లు, యువత, వీరమహిళలు, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకునే ప్రజలు వచ్చి సభను విజయవంతం చేశారు. వారి అభిప్రాయాలను శతఘ్ని వేదిక మీద పంచుకున్నారు. అడ్డగోలు రాజకీయాలు చేస్తున్న స్థానిక వైసిపి ఎమ్మెల్యేకి గట్టి పోటీని ఇస్తామని యాభై వేల మెజారిటీతో బత్తుల బలరామకృష్ణని గెలిపించుకుంటామని నినాదాలు చేస్తుంటే చప్పట్లతో సభ దద్దరిల్లిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, బత్తుల బలరామకృష్ణ నాయకత్వం మీద ఉన్న నమ్మకం నాయకులు ఉపన్యాసాల్లో ప్రతిధ్వనించింది. జనసైనికులు అంతా బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని కోరుకుంటున్నామని ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటారు. బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో జరిగిన శ్రీరాంపురం ర్యాలీ, రణభేరి సభల విజయోత్సహాన్ని జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే నిస్తేజంగా జనమే లేకుండా జరిపిన ట్రాక్టర్ ర్యాలీ కేవలం డ్రైవర్ల ర్యాలీలాగా నిరాశపరచడంతో ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా వేదికగా చెప్పిన గొప్పలు తిప్పి కొడతానని జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ బలంగా చెప్పడంతో జనసేన శతఘ్ని టీం ను ప్రారంభించడంతో ఇక రాజావారికి దీపావళి దీపాలు పోయి అమావాస్య మిగిల్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.