పాపం పసివాడు – పేదలపై స్పందించారు

నెల్లూరు, జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా స్థానిక నగర సీఐ అడ్డుకున్నారు. వైసిపి వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు లేని అభ్యంతరం మాకు ఎక్కడి నుంచి వచ్చింది. జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నిలదీశారు. ఎంతసేపటికి ఒప్పుకోపోవడంతో రెండు రోజుల్లోగా ఈ ఫ్లెక్సీలు తొలగించకపోతే జనసేన పార్టీ తరఫున నిరసన ఉధృతం చేస్తాము. ప్రతి ఫ్లెక్సీ పక్కన జనసేన ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
▪️ 450 కోట్ల రూపాయల ఆర్థిక నేరం మోపబడి, వేల కోట్ల పైబడి సంపాదన కలిగి ఉన్న జగన్ పేదల పెన్నిదా..?
▪️ సొంత సంపాదన నుంచి పేదలకు ఏనాడు ఒక రూపాయి ప్రజలకు ఇచ్చినట్టు లేదు.
▪️ స్థానికంగా ఇసుక గ్రావెల్ రూపంలో అక్రమంగా దోచుకు తింటున్న పెత్తందారులు వైసీపీకి నాయకులు కాదా…?
▪️ ప్రజలను పల్లకిలో కూర్చోబెట్టడానికి వచ్చిన మా నాయకుడు ఎవరి పల్లకి మోయడానికి సిద్ధంగా లేరు..
▪️ కోట్ల రూపాయల సొంత సంపాదిన నుంచి పేద ప్రజలకు పంచిస్తున్న మా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే సాయిలు మీకు లేదు.
అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నిరసన చేపట్టారు. నగరంలో పలుచోట్ల పెద్దలకు పెత్తందారులకు జరిగే యుద్ధం అంటూ జగన్ ఫ్లెక్సీల పై నిరసన ప్రదర్శిస్తూ పాపం పసివాడు అనే జగన్ ఫ్లెక్సీ ఏర్పరచి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
▪️ పేదలు ఎవరు పెత్తందారులు ఎవరు అనేది ప్రజలు తెలుసుకోకుండా లేరు.
▪️ రాష్ట్రం మొత్తం మీద ఇసుక గ్రావెల్, సిలికాన్ అక్రమ మైనింగ్ తో సంపాదిస్తూ ప్రజా ధనం దోచుకుంటుంది వైసిపి నాయకులు పెత్తందారులు కాదా..?
▪️ పేదల భూముల అక్రమంగా దోచుకుంటున్నది వైసీపీ పెత్తందారులు కాదా..?
▪️ జనసైనికుల మనోభావాలు దెబ్బతీస్తూ ఏర్పరిచిన పోస్టర్లకు పోస్టులకి అభ్యంతరం వ్యక్తపరుస్తూ అధికారులు కలవడం జరిగింది.
▪️ ఈ రెండు మూడు రోజుల లోపల ఇక ఈ ఫ్లెక్సీలు తీసివేస్తే సరసరి లేకపోతే ఎక్కడెక్కడ అయితే ఈ ఫ్లెక్సీల ఏర్పాటు చేసారో మేము కూడా ఫ్లెక్సీల ఏర్పరిచే హక్కు మాకు ఉందని తెలియపరుస్తాము.
▪️ నగర ఎమ్మెల్యే పలుమార్లు ఫ్లెక్సీల నిషేదం గురించి ప్రస్తావించారు. ఈరోజు ఏ ఉద్దేశంతో ఫ్లెక్సీలు నగరంలో పలుచోట్ల ఏర్పాటు చేశారు.
▪️ తమ పెత్తందారుల ఫ్లెక్సీలు మాత్రం ఎక్కడైనా వేయచ్చు ఇంక మరి ఎవరూ వెయ్యకూడదనేది దీని అర్థమా అనేది తెలియడం లేదు.
▪️ అణగారిన వర్గాల ప్రజలను పూల పల్లకిలో వచ్చిన నాయకుడే మా పవన్ కళ్యాణ్ పేద బలహీన బడుగు వర్గాలకు చెందిన వారందరికీ రాజ్యాధికారం అందే విధంగా ప్రయత్నిస్తున్న తమ నాయకుడిపై బురద జల్లాలని చూస్తే సహించలేదు.
▪️ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడల్ల వంచుతానని చెప్పి కేంద్రాన్ని తలదించుకుని పల్లకిలో మోస్తుంది మీ వైసీపీ నాయకులు కాదా.. గుర్తు చేస్తున్నామని తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ప్రశాంత్ గౌడ్, సుధీర్ బద్దిపూడి, షాకీర్, శివ, బాలు, వినోద్, శ్రీకాంత్, చిన్న రాజా, అమీన్, షాజహాన్, మౌనిష్, వర, వర్షన్, సాయి, షారు, ఋషి, ప్రసన్న, హేమచంద్ర యాదవ్, రాము తదితరులు పాల్గొన్నారు.