ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన సింగరాయకొండ జనసేన నాయకులు.

కొండేపి, మండల ప్రజలు వారి సమస్యలు జనసేన పార్టీకి దృష్టికి తీసుకొని రావడం జరిగినది. దీనిపై సింగరాయకొండ మండల ఆర్టీసీ బస్టాండ్ లో మండల నాయకులు సందర్శించడం జరిగింది. మురికినీరు నిలువ ఉండి దుర్వాసన చెందుతూ, దోమల అభివృద్ధి చెంది ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నాయి. కనీసం మరుగుదొడ్లు కూడా అద్వానంగా మారి దుర్వాసన చెందుతున్నాయని ప్రయాణికులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతవేటు దూరంలో ఉన్న సంబంధిత అధికారిని జోనల్ అభివృద్ధి దేవుడెరుగు సొంత ఊరులో అభివృద్ధి చేసుకోక పోవటం దౌర్భాగ్యం, ఫోటోలు వీడియోలకే పరిమితమైన నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఆర్టీసీ బస్టాండ్ లోపల ఎక్స్టెన్షన్ పేరుతో గుంటలు తీసి సుమారు నెలలు గడుస్తున్నా కన్స్ట్రక్షన్ చేయడంలో అలసత్వం వహించడం వల్ల వర్షపునీరు సాకుతో పని చేయకుండా ఉండడం ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. కనీసం టాయిలెట్స్ కు పోవాలన్న కొత్తవారికి ఎటుపోవాలో అర్థంకాక బస్టాండ్ లో ఉన్న చెట్లు చాటున మూత్ర విసర్జన చేయవలసిన దుస్థితి ప్రజలకు కల్పించిన వైసీపీ ప్రభుత్వము. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం కూల్చటం మానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్టాండ్ లోపల నూతనంగా నిర్మిస్తున్న కన్స్ట్రక్షన్ ని ఎత్తులేపి ప్రజలు మునిగిపోకుండా కన్స్ట్రక్షన్ చేయవలెను అని, అలాగే నూతన మరుగుదొడ్లు నిర్మించవలెను అని బస్టాండ్ పరిసరాల్లో మద్యం విచ్చలవిడిగా తాగి మద్యం సీసాలను బస్టాండ్ రోడ్డు ఇరువైపులా వేయటంపై ఆర్టీసీ డిపో మేనేజర్ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ బస్టాండ్ మేనేజర్ డి ఎస్ ఆచార్యులు వారు బస్టాండ్ ఆవరణలో బ్లీచింగ్ చల్లించి మద్యం సీసాలు వేయకుండా చర్యలు చేపట్టగలరని మండల జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నది. పైన తెలిపిన ప్రజా సమస్యలను పరిష్కరించక పోతే, దీనిపై మండల జనసేన పార్టీ నాయకులు అధికారులపై ఉక్కు పాదం మోపుతుంది, అధికారులు ఇకనైనా మేల్కొని సంబంధిత సమస్యలపై తగు పరిష్కారం చూపకపోతే రోడ్లు పైకి రావడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ భాష, అనుమలశెట్టి కిరణ్ బాబు, సంకే నాగరాజు, షేక్ మా బాషా, శీలం సాయి, శీలం గోపి, షేక్ సుల్తాన్ భాషా, తగరం రాజు, సయ్యద్ సుభాని, శ్రీనాథ్, సయ్యద్ వాహిద్, రెనుమల మహేష్ బాబు, అర్ సందీప్, సయ్యద్ రియాజ్, నంబూరి మోహన్, అన్నం గణేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.