జనసేన విద్యార్థి విభాగం తరపున అంబేద్కర్ కు ఘననివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డా. BR అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి జనసేన విద్యార్థి విభాగం తరపున ఘననివాళులు అర్పిస్తున్నాం. ఆ మహనీయుని స్పూర్తితో రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్ది నాయకులు కొండ పవన్ కుమార్ జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరి జిల్లా విద్యార్ది నాయకులు రాం ప్రసాద్, M. పవన్ కళ్యాణ్, పొంది వంశీ యువజన నాయకులు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.