సింగనమల కేజీబీవీకి సరుకులు అందిస్తున్న ఏజెన్సీని రద్దు చేయాలి

సింగనమల: అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో డిసెంబర్ రెండవ తేదీ పాయిజన్ ఫుడ్ తిని విద్యార్థులు తీవ్రత అస్వస్థతకు గురయ్యారు. అయితే విద్యార్థులకు అందిస్తున్న ఏజెన్సీలు సరుకులు నాణ్యత లేకపోవడంతో కుళ్లిన సరుకులతో వంటలు చేయడం వల్ల మజ్జిగ విషతుల్యమై విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల పాలవడం జరిగింది. అయితే అధికార యంత్రాంగం ఏజెన్సీ ని వంట మనుషులను తప్పించకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో సంబంధం లేని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని ఏజెన్సీ వారు అందించిన నాణ్యత లేని సరుకులపై ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే సరుకులను సరఫరా చేయు ఏజెన్సీని మరియు అధికార పార్టీకి చెందిన వంట మనుషులను వెంటనే తప్పించాలని అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో కుళ్ళిన సరుకులను సరఫరా చేస్తున్నారని బాధితులు బహిరంగంగానే చెబుతున్నా విద్యార్థినులకు న్యాయం జరగలేదు. 82 మంది విద్యార్థినులు వివిధ ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఏజెన్సీని తప్పించేంతవరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు సాగిస్తూంటామని ఎంతవరకైనా పోరాడుతామని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీ కృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శులు బొమ్మన పురుషోత్తం రెడ్డి, దేవరకొండ జయమ్మ, నాయకులు బందెల సాయి శంకర్, మన్నల పెద్దిరాజు, శేషు, మధు జూలకలువ, తదితరులు పాల్గొన్నారు.