చీరాల జనసేన ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

చీరాల: స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ రథసారథి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ చీరాల నియోజకవర్గం తరఫున వేటపాలెం మండల అధ్యక్షులు మార్కండేయులు ఉగ్గిరాల మరియు చీరాల నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాలవలస శ్రీనివాస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుల వారు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ధైర్యాన్ని, తెగింపుని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీని చీరాల నియోజకవర్గంలో బలోపేతం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ యువత సోమిశెట్టి కిరణ్, వరుణ్, బత్తిన బాలాజీ, పల్లపోలు పవన్ కుమార్, కటకం గోపి, కటకం రామ కృష్ణ, కటకం బాలాజీ నల్లారి వెంకట సాయి, చుండూరు శ్రీను మరియు పసుపులేటి సాయి పాల్గొన్నారు.