ప్రత్తికోళ్ళలంక గ్రామంలో ‘సూపర్ సిక్స్’ కార్యక్రమం

దెందులూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్ మండలం, ప్రత్తికోళ్ళలంక గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టో అయిన ‘సూపర్ సిక్స్’ పథకాల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి గ్రామంలోనే ప్రతి ఇంటికి వెళ్లి ‘సూపర్ సిక్స్’ పథకాలని వివరించి దెందులూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస్ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, దెందులూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి తాతపూడి చందు, టిడిపి ఏలూరు మండలం అధ్యక్షులు మున్న నాగరాజు, క్లస్టర్ ఇన్చార్జి నేతల రవి, ప్రత్తికోళ్ళలంక మాజీ ఎంపీటీసీ మువ్వల అశోక్, గ్రామం టిడిపి నాయకులు ఘంటసాల సుబ్రహ్మణ్యం మరియు స్థానిక జనసేన, టిడిపి, బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.