బొర్రా ఆధ్వర్యంలో గర్జించిన జనసేన వీరమహిళలు

  • వర్రా రవీంద్రా రెడ్డిపై డి.ఎస్.పి కి కంప్లైంట్ ఇచ్చిన జనసేన వీరమహిళలు

సత్తెనపల్లి నియోజకవర్గం: రాష్ట్రంలో సోషల్ మీడియాలోనూ, సమాజంలోనూ మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఖండించి, భాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సోమవారం సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీకి చెందిన వీరమహిళలు భారీగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అనేక నినాదాలతో పట్టణమంతా హోరెత్తించారు. ర్యాలీ తర్వాత వారంతా స్థానిక డి.ఎస్.పి కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వర్రా రవీంద్రా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పబట్టి మీరు రోడ్లమీద తిరుగుతున్నారని లేదంటే మీరు ఇళ్ళల్లో నుండి బయటికి కూడా రాలేరని వైసీపీ గూండాలను హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా మాట్లాడుతుంటే, ప్రజల తరఫున సమస్యల్ని ప్రస్తావిస్తుంటే చేతగాని చవటల్లాగా వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుమాలిన విషయం అన్నారు. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగిస్తే తగిన రీతిలో గట్టిగా బుధ్ధి చెప్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ, పట్టణ వీరమహిళలు మాలెంపాటి సౌజన్య, నామాల పుష్పలత తదితర వీరమహిళలు భారీగా పాల్గొన్నారు. వీరికి తోడుగా సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు కేశవ, బత్తుల వీరాంజనేయులు, దార్ల శ్రీనివాస్, అంపిరాయని రాజశేఖర్, రామిశెట్టి శ్రీనివాస్, తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.