“మహా రక్తదాన శిబిరం” అత్యంత విజయవంతం

రాజానగరం, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా… రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి శ్రీమతి “నా సేన కోసం నా వంతు” కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో జరిగిన ” మహా రక్తదాన శిబిరం” అత్యంత విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, ప్రత్తిపాడు జనసేన పార్టీ ఇంచార్జ్ పరుపులు తమ్మయ్యబాబు, జగ్గంపేట ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి ప్రియా సౌజన్య, రాష్ట్ర డాక్టర్ సెల్ కార్యదర్శి నాగ మానస, జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, రాష్ట్ర జనసేన నాయకత్వం, జిల్లా కార్యవర్గం, రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, విద్యార్థులు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి… రక్తదాన కార్యక్రమం అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మంది రక్తం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రక్తదాన శిబిరం నిర్వాహకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో ఇదే స్ఫూర్తితో, ఇంతకు మించిన హుషారుతో, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి, జనసేన పార్టీని మరింత ఉధృతంగా క్షేత్రస్థాయిలో బలపరుస్తామని తద్వారా వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం పోరాడి, జనసేన ప్రభుత్వం స్థాపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడడమే తమ అభిమతమని ఈ సందర్భంగా బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరిచారు.