హైకోర్టులో ఎంపీ ర‌ఘురామ‌కు చుక్కెదురు

జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హై కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని హైకోర్టు తిర‌స్క‌రించింది. బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు ఇవ్వాళ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ ర‌ఘురామ కోర‌గా కోర్టు తిర‌స్క‌రించింది.

పిటిష‌న్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో.. రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది.

ఎంపీ ర‌ఘురామ వేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌పై ఈరోజే సీబీఐ కోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది.