అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేసిన వారిని కఠినంగా శిక్షించాలి

  • రాజంపేట శాసనసభ్యులు స్పందించాలని డిమాండ్
  • ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

రాజంపేట, అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ విశ్వనాథ నాయక్ జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం విగ్రహాన్ని రాయవరంలో చెత్తకుప్పలో పడవేసి అవమాన పరిచారని, అలాంటి వారి పైన ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి కనీసం స్పందించకుండా దోషులను కాపాడే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారని మండల వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారని, ఇంతటి నీచానికి దిగజారుడు నేరస్తులను కాపాడటం మంచి పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు మల్లికార్జున్ రెడ్డికి రాజ్యాంగం పైన గాని అంబేద్కర్ పైన గాని విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే తక్షణమే పాత్రికేయుల మీటింగ్ ఏర్పాటు చేసి బహిరంగంగా అలా ప్రవర్తించిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెబితే అందరూ ఆనందపడతామని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే నాయకుడు కాదని ఈ దేశంలో ఉండే ప్రతి వ్యక్తి కోసం రాజ్యాంగం రాసినటువంటి మహానీయుడని అలాంటి మహనీయుడికి అవమానం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు తప్పేపల్లి చంద్రమౌళి అఖిల భారత విద్యార్థి సమైక్య మండల అధ్యక్షులు నాగేంద్ర ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.