తిరుపతి జనసేన ఆత్మీయ సమావేశం

తిరుపతి సీటును గెలిచి పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇద్దాం – ఆరణి

తిరుపతి సిటీ, తిరుపతిలో జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తో జనసేన క్యాడర్ పరిచయ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జెఎంసి జగన్ లు హాజరయ్యారు, ఆ పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి అధ్యక్షతన ఈ పరిచయ సమావేశం కొనసాగింది. ఈ కార్యక్రమంలో తిరుపతిలోని 50 డివిజన్ల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, వీరమహిళలు, లీగల్ సెల్ సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నగర కమిటీలు మరియు జనసైనికులు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో జనసేన జెండా ఎగరవేయాలని, దానికోసం ప్రతి వార్డు అధ్యక్షుడు, కమిటీ సభ్యులందరూ శక్తి వంచన లేకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనందరం తప్పక పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మన నాయకుడు పవన్ కళ్యాణ్ వైసీపీ పై యుద్ధం చేస్తున్నారని, తిరుపతిలో పెద్ద ఎత్తున వైసీపీ దొంగ ఓట్లను చేర్చారని, మనం రాక్షసులతో పోరాటానికి సిద్ధంగా ఉండాలని, వార్డులు వారిగా దొంగ ఓట్లను గుర్తించాలన్నారు. ప్రతి ఇంటికి మన గాజు గ్లాస్ గుర్తును తీసుకువెళ్లాలని కోరారు. ఈ ఎలక్షన్ లో పనిచేసే ఏ ఒక్క జనసైనికుడి ఒంటి పై గీత పడ్డా, తక్షణమే మీకు అండగా నేను అక్కడ ఉంటానని వారు జనశ్రేణులకు హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు కేంద్ర బలగాలు పెద్ద సంఖ్యలో తిరుపతిలో మోహరించనున్నాయన్నారు. మనందరం సమిష్టి కృషిగా కలిసి పనిచేసే పవన్ కళ్యాణ్ కి తిరుపతి సీటును గెలిచి గిఫ్ట్ గా ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో అందరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎవరు, ఎటువంటి అపోహలకు పోవద్దని, అందరం కలిసి జనసేన పార్టీకి పనిచేస్తున్నామని గుర్తుచేశారు. ప్రచారంలో టిడిపి బిజెపి నేతలను కార్యకర్తలను కలుపుకోవాలన్నారు. రాష్ట్రంలోనే తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని స్పష్టం అయన చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడమే ఉమ్మడి పార్టీల లక్ష్యమని వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీరమహిళలు, జనసైనికులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.