టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి: సి.జి రాజశేఖర్

అధికార పార్టీకి సంబంధించిన న్యూస్ పేపర్లో గురువారం రాసిన రాతలు ఇవి…..ఇది నిజమా కిలో టమాట 20 రూపాయలు అమ్ముడుపోతున్నాయంట? టమోటాల బాక్స్ 200 పోతాందంట?

మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులు కుంభక్కై 100 కేజీలు లేదంటే 200 కేజీలు వీరు పైన చెప్పిన విధంగా కొని…. టమోటా రైతుల్ని ప్రజల్ని మోసం చేసి మభ్యపెడుతున్నారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టమోటా రైతుకు కిలో టమోటా ధర రూపాయి కూడా లభించడం లేదు. కోత కోయడానికి కూలీల ఖర్చులు మార్కెట్కు కు తేవడానికి రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావట్లేదు. టమోటా రైతులంతా ఆరుకాలం కష్టించి శ్రమించి పండించిన పంటను రోడ్లపైన పారవేసి నిస్సహాయ స్థితిలో ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు.

జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు గొప్పలు చెప్పుకుంటూ, కాకి లెక్కలు చెబుతూ వ్యవసాయ రంగానికి లక్ష 28,000 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారు, బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాం అని చెప్పారు, ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు ఏర్పాటు చేశామని చెపుతున్నారు, సీఎం యాప్ ద్వారా సమాచారం సేకరించి రైతులకు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటున్నాం అని చెబుతున్నారు.

కేవలం పబ్లిసిటీల కోసం… హంగు ఆర్భాటాల కోసం కాకుండా చిత్తశుద్ధితో కాయగూరలు పండించే రైతులని అందులో ముఖ్యంగా టమోటా రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సి.జి రాజశేఖర్ డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *