పాలకొండ జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు

పాలకొండ నియోజకవర్గం, జగనన్న ఇళ్ళు, పేదల కన్నీళ్లు… పేద ప్రజలపై ప్రభుత్వం నిర్లక్ష్యం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాలకొండ జనసేన పార్టీ నాయకులు పాలకొండ – లుంబురు ఎక్కడికక్కడ ఈ ఇళ్ల స్కామ్ లను బహిర్గతం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పాలకొండ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పాలకొండ మండలం లూంబురు గ్రామం పరిధిలో ప్రభుత్వం సేకరించిన స్థలం కొనుగోలు లోనే భారీ అక్రమాలు చోరోచేసుకున్నయని ఆరోపించారు. ఇళ్ళు నిర్మించకపోతే పట్టా రద్దు చేస్తామని అధికారులు లబ్ధిదారులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపద్యంలో అక్కడ ఇళ్లు నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు కష్టాలు తప్ప ఇంకేమి మిగలడం లేదన్నారు. కనీసం నిర్మాణంకు నీళ్లు లేకపోవడంతో డ్రమ్ము నీరు రూ 50 ఇచ్చే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దూర భారం ఒకవైపు, అక్కడ కనీస వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారని వాస్తవాలు అలా లేవన్నారు. కొందరు కాంట్రాక్టర్లు అక్కడ లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. ఇళ్ళు హడావిడిగా ఇచ్చారని కనీసం ఇళ్లల్లో కరెంట్ సౌకర్యాలు లేవని ఆరోపించారు. లబ్ధిదారుల నుండి విద్యుత్ కనెక్షన్లు కోసం సొమ్ము చెల్లించాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పేదలకు అండగా నిలుస్తామని, ఇళ్ల నిర్మాణం అవకతవకలుపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ జనసేన పార్టీ నాయకులు పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జనసేన జానీ, బోర వాసు అనిల్ ఈశ్వర్ రాకేష్ ఉమా తదితరులు పాల్గొన్నారు.