తోట స్వామి ఆధ్వర్యంలో నాదెండ్లకు పార్టీ శ్రేణుల ఘన స్వాగతం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం, జనసేన నాయకుడు నాదెండ్లకు ఈతకోటలో జనసేన జనసైనికులు, వీరమహిళలు ఘన స్వాగతం పలికారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోపర్యటన ముగించుకొని మండలం పరిధిలోని ఈతకోట గ్రామం మీదగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఈతకోటలోని హైస్కూలు వద్ద జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీనివాస్ తరపున మండల పార్టీ అధ్యక్షుడు తోట స్వామీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో, ఈతకోట గ్రామం వన్. ఎంపీటీసీ బొరుసు సీతారత్నం, గ్రామ పార్టీ అధ్యక్షుడు, యర్రంశెట్టి రాంమోహన్ రావు(రాము), నాయకులు గండ్రోతు గౌతమ్, కంకటలా పవన్ మణికంఠ, బిక్కిన శ్రీను, గల్లా సత్యప్రకాష్, నంబు రవి కుమార్, నరాలశెట్టి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, నంబు నాగు, బండారు వాసు తదితరులు పాల్గొన్నారు.