జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఇచ్చాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం తిప్పన దుర్యధన రెడ్డి నాయత్వములో మెడికవర్ వారి సౌజన్యంతో జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చాపూరం మండలం డొంకురు గ్రామంలో ఆ గ్రామ జనసైనికుల సహకారంతో ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు చేతులు మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరిబెహరా మరియు ఇచ్చాపురం జడ్పిటిసి అభ్యర్థిని తిప్పన నీలవేణి రెడ్డి, 10 వార్డు అభ్యర్థి భాస్కర్ రెడ్డి, వీరమహిళ భారతిరెడ్డి, లోళ్ళ రాజేష్, బైపిల్లి దాలయ్య మరియు సి.హెచ్.కృష్ణ, కె. జానకిరావు, డి.పాపారావు, పి.జానకిరావు, జె.దిల్లేష్, డి.ప్రకేష్, టి.మోహన్, సి.హెచ్.నరేష్, బి.సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో ప్రజలకు సుమారు రెండు వందల మందికి పైగా మందులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ డొంకురు గ్రామంలో గత మూడు నెలల కాలంలో వైరల్ ఫీవర్ ఉండడంవల్ల గ్రామ జనసైనికులు జనసేన నాయకుల్ని సంప్రదించగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.