వికృతమాలలో వైకుంఠ ద్వార దర్శనం

  • శ్రీ సంతాన సంపద వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం ఏర్పాటు
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

అత్యద్భుతమైన పుష్ప సోయగాలు.. వేద మంత్రోచ్చరణలు…గోవింద నామస్మరణలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా 11వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి నిర్వహిస్తున్న వికృతమాల శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయము ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 23-12-2023 శనివారం ఉదయం 6 గంటల నుంచి 24-12-2023 ఆదివారం రాత్రి 8 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. ఈ రెండు రోజుల పాటు భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చన్నారు. స్వామి వారి దర్శనానికి సమీప ప్రాంతాల ప్రజలు తరలి రావాలని పిలుపు నిచ్చారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్వామి దర్శనానికి భక్తులు విచ్చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఆ ప్రకటనలో కోరారు.