ఓటర్ల జాబితా పారదర్శకంగా తయారుచేయాలి

  • ఐటిడిఎ పీవో కల్పనా కుమారి

పాలకొండ నియోజకవర్గం: పాలకొండలోని అన్ని రాజకీయ పార్టీలతో మరియు నాలుగు మండలాల తహశీల్దార్లు, డీటీలు, ఎన్నికల ఆపరేటర్లు, ఇతర సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున జనసేన జానీ మాట్లాడుతూ.. మా నియోజకవర్గం పరిధిలో అధికంగా బోగస్ ఓట్లు ఉన్నాయి, వాటితో పాటుగా గత ఎలక్షన్స్ నుంచి నేటివరుకు నియోజకవర్గానికి సంబందించిన ప్రతి ఊరులో చనిపోయిన వ్యక్తులు పేర్ల మీద ఇంకా అలానే ఓట్లు ఉన్నాయి. అలానే కొత్తగా ఓటు హక్కు కోసం ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా ఓటు హక్కు వచ్చేలా చూడండి. పైగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో మా గ్రామంలో మేము ఓటు వెయ్యాలి అంటే మేము పక్క ఊరు వెళ్లవలిసి వస్తుంది. కనుక మా ఊరులోనే ఈ జరిపించేలా చేయ్యండి మేడం ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా అవస్థలుపడుతున్నారని పీవో కల్పనా కుమారి మేడం కు నియోజకవర్గ సమస్యలు జనసేన జానీ తెలియచేయ్యడం జరిగింది. దీనిపై స్పందించిన పీవో కల్పనా కుమారి మాట్లాడుతూ.. జులై 21వ తేదీ నుంచి ఓటర్ల జాబితాలో తప్పులు, మరణించిన వారి పేర్లు తొలింగించడం పోలింగ్ బూత్ లను సరిచేయడం, వేరే రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లు తొలగించడం వంటి అన్ని రకాల లోపాలను సరిచేయడం జరుగుతుందని అన్నారు. ఈ సర్వేలో ఏటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదని అన్నారు. కేవలం బి.ఎల్.ఓ లు, సంబంధిత సూపర్ వైజర్లు మాత్రమే సర్వేలో పాల్గొనాలని అన్నారు. వాలాంటీర్లు, ఎన్జీవోలు, ఇతర రాజకీయ పార్టీల వ్యక్తుల ప్రమేయం ఉండకూడదని పీవో అన్నారు. బి.ఎల్.ఓ లు సర్వే చేసేటప్పుడు రాజకీయ పార్టీల ఏజెంట్లకు సమాచారం ముందుగానే ఇవ్వాలని అన్నారు. సర్వే షెడ్యూల్ ను రాజకీయ పార్టీలకు అందజేయాలని అన్నారు. షెడ్యూల్ ను తహసీల్దార్ కార్యాలయాల్లో, సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. అదే విధంగా వివిధ రాజకీయ పార్టీలు చెప్పిన అంశాలను పరిశీలిస్తామని అన్నారు. కొత్త పంచాయతీలకు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున జామి, అనిల్, ప్రేమ్, విశ్వనాధం పాల్గొన్నారు.