రైతులకు అండగా ఉంటాం

  • దళితులంటే తోటకు ద్వేషం
  • వల్లూరి వివాదంపై న్యాయవిచారణకు సిద్ధమా…?
  • జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

మండపేట, జనసేన పార్టీ రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు అండగా ఉంటుందని మండపేట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేట బాబు అండ్ బాబు కనవర్షెన్ హాల్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీలాకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తోట త్రిమూర్తులకు దళితులంటే ద్వేషమని ఆరోపించారు. ఆయన కార్యాలయంకు వెళితే కనీసం కుర్చీ కూడా లేకుండా దళిత ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తారని ప్రచారం ఉందని ఆరోపించారు. వల్లూరిలో ఈ ఏడాది జనవరి 1 న దళిత మహిళా సర్పంచ్ ను ఎమ్మెల్సీ దూషించిన ఫుటేజ్ పై ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. దీనిపై వల్లూరులో ప్రతి గడప నుండి తోట వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తారని పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరలో మండపేట విచ్చేస్తారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా అందిస్తారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నరని ఆరోపించారు. కష్టం భరించలేని కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రు 7 లక్షల ఆర్థిక సహాయాన్ని ఏడురోజులలోగా అందించాలని జీవోలో స్పష్టంగా ఉన్నా ఇప్పటికీ అందించకపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మండపేట నియోజకవర్గంలో అయిదు గురు కౌలు రైతులు ఆత్మహత్య లు చేసుకోగా అందులో ఒకరికి మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందిందని పేర్కొన్నారు. మిగిలిన వారి కుటుంబానికి జీవో నెంబర్ 43 ప్రకారం రావలసిన ఆర్థిక సాయం ఇప్పటికీ అందలేదని విమర్శించారు. దీంతో చనిపోని రైతు కుటుంబల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పార్టీ అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.