వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేస్తాం

  • వరుపుల తమ్మయ్యబాబు అద్వర్యంలో జనసేనలో చేరికలు

ప్రత్తిపాడు నియోజకవర్గం, రౌతులపూడి మండలం, రౌతులపూడి గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు అద్వర్యంలో రౌతులపూడి గ్రామ నాయకులు యెద్దు చిన్నా నాయకత్వంలో వైసీపీ మరియు టీడీపీ పార్టీలను వీడి 50 మంది జనసేన పార్టీ కండువా కప్పుకుని జనసేనలో చేరడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి తాము పార్టీలో చేరుతున్నామని డా.బి ఆర్ అంబేద్కర్ ఆశించిన సామజిక న్యాయం ఒక్క పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమనే విశ్వాసంతో తాము పార్టీలో చేరుతున్నామని వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేస్తామని వారు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, యువ నాయకులు వరుపుల సాయికిరణ్, రౌతులపూడి గ్రామానికి చెందిన ప్రముఖ జనసేన నాయకులు యెద్దు చిన్నా, బంగారియ్యపేటకు చెందిన నియోజకవర్గ జనసేన నాయకులు వెంకీ, గుమ్మరేగలకు చెందిన జనసేన నాయకులు నానాజీ, బంగారియ్యపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు గణేష్, ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రముఖ జనసేన నాయకులు కృష్ణార్జున (మెరక చామవరం), రమేష్, యర్రంశెట్టి దుర్గాప్రసాద్ (బద్రవరం), జనసైనికులు లోకేష్, ప్రసాద్, వాసు, ఇతర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ 3 వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ… ఇవాళ ఎంతోమంది దళిత యువకులైనటువంటి సోదరులు మన పార్టీ యొక్క సిద్ధాంతాలను నచ్చి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల మీద నమ్మకంతో ఈ రౌతులపూడి గ్రామంలో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఇదే మన పార్టీ యొక్క బలం ఇదే మన పార్టీ యొక్క భావజాలం రాబోయే రోజుల్లో ఇదే రౌతులపూడి నుంచి ఎంతోమంది మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రౌతులపూడి మండలం మొత్తం జనసేన పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మనమందరం కూడా పనిచేయాలి. ఇవాళ రైతే రాజు అని వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు చాలామంది ఉన్నారు కానీ నిజంగా రైతును పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇవాళ రైతు గురించి ప్రత్యేక శ్రద్ధ వహించారు ఆయన అహర్నిశలు కష్టపడి కింద పడి మీద పడి ఎంతో శ్రమించి సంపాదించినటువంటి కోట్లాది రూపాయల డబ్బులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న కవులు రైతు కుటుంబాలకు భరోసాగా అందించడం జరుగుతుంది. ఈరోజుకి ఆ కుటుంబాలకి సరైన ఆదరణ ప్రభుత్వం నుంచి లేకపోవడం శోచనీయం. అలాగే ఇవాళ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో సౌకర్యవంతమైన జీవనం సాగిస్తూ కోట్లాది రూపాయలను వెనకేసుకునేటువంటి వృత్తిలో ఉండి కేవలం ప్రజలను ఏదో ఒక విధంగా మేలు చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో తన సుఖాలను తన సౌఖ్యాలను వదులుకొని ఈ రోజున ఆయన పని చేయడం జరుగుతుంది. ఎంతవరకు నియోజకవర్గంలో పార్టీ ఒక ఎత్తు ఇకపై ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ అత్యంత వేగవంతంగా పుంజుకునే లాగా మన కృషి ఫలించబోతుంది అని జనసైనికులతో తన యొక్క భావాలను పంచుకోవడం జరిగింది.

……………………………………………………………………………

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కార్యదర్శి అయినటువంటి నల్లల రామకృష్ణ మాట్లాడుతూ… ఈ రోజున పార్టీలోకి కొత్తగా వచ్చేటువంటి జనసైనికులు అందరూ కూడా మన పార్టీ భావజాలాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు మేనిఫెస్టో తదితర అంశాలను తెలుసుకోవాల్సి ఉంది వీటన్నిటిని మనం ఇంటింటికి ప్రచారం చేయగలిగితే జనసేనలో ఉన్నది యువకులే కానీ సమాజం మీద ఎంతో పరిణితి చెందిన వ్యక్తులు అని ప్రజలు మనల్ని అందరినీ కీర్తిస్తారు తద్వారా మన పార్టీని ఆదరిస్తారు. ఆయన మాట్లాడుతూ ఇంతకీ మన పార్టీ సిద్ధాంతాలు అయినటువంటి కులాలను కలిపే ఆలోచన విధానం మతాలను ప్రమేయం లేని రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతలను కాపాడే సమాజం అవినీతిపై రాజీలేని పోరాటం పర్యావరణ అనుకూల అభివృద్ధి ప్రస్థానం ఇలాంటి సిద్ధాంతాలు కేవలం రాష్ట్రంలో మన పార్టీకి మాత్రమే ఉన్నాయని గర్వంగా చెప్పొచ్చు ఇవన్నీ సమాజంలో తరతరాలుగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలే ఈ యొక్క సిద్ధాంతాలని మనమందరం అర్థం చేసుకోవాలి. అలాగే మన జనసేన పార్టీ మేనిఫెస్టోలో మనకి కొత్తగా షణ్ముఖవ్యూహం అని పేరుతో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా అమరావతి అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించిన రాజధానిగా కొనసాగుతుంది అలాగే మనం అధికారంలోకి వచ్చేటప్పటికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఒక్కదాన్ని భర్తీ చేస్తాము అని నిరుద్యోగులకు భరోసా ఇవ్వడం జరిగింది అంతేకాదు ఇంకా ఎంపిక కాబడిన నిరుద్యోగులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పెట్టుబడి సహాయంగా చేసి వారిని నెమ్మది నెమ్మదిగా ఒక పారిశ్రామికవేత్తలుగా పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది తద్వారా ఆ నిరుద్యోగులే కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా మనం అభివృద్ధి చేస్తాము అంతేకాదు గతంలో ఉండేటువంటి రెండు ప్రభుత్వాలు రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మనం అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతాము అని మన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది ఇది మనమందరం ప్రతి ప్రభుత్వం ఉద్యోగికి తెలిసేలాగా ప్రచారం చేసి చైతన్యం చేయాలి అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు తన సొంత డబ్బులు శ్రమించి కష్టపడిన డబ్బులను కోట్లాది రూపాయలను భరోసాగా అందించారు మనం అధికారంలోకి రాగానే ఎకరాకి ఎనిమిది వేలు సాగు సాయం అందిస్తామని మరో అంశం అని తెలియజేశారు అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించి ఏవైతే నీటి వనరులకు సంబంధించి కాలువలు చెరువులు నదీ పరివాహక ప్రాంతాలు ఇంకా చిన్న చిన్న ఇతరులను ఆధునికరించి వ్యవసాయానికి సస్య సేవలు అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వ్యవసాయ రైతుకి గిట్టుబాటు ధర ఎప్పుడూ తగ్గకుండా ఉండేలాగా నిరంతర చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే వ్యవసాయానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులకు తగిన డిమాండ్ కలిగేలాగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు గురించి ఆలోచించనవసరం లేకుండా ఎక్కడ ఉండేటువంటి విజయవాడ తదితర నగరాలను సాఫ్ట్వేర్ నగరాలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది విశాఖ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాయలసీమలో ఉన్న రాజధాని కర్నూలు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు త్యాగం చేయడం ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితిని రాయలసీమ వాసులకు ఇవాళ కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా అని పేరు పెట్టి రాయలసీమకు తగిన సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది అనే అంశం కూడా మన షణ్ముఖ్యోగంలో భాగమని తెలియజేశారు. ఇంకా గ్యాస్ ను ఉచితంగా మహిళలకు అందజేయడం మన మేనిఫెస్టోలో భాగమని తెలియజేయడం జరిగింది అంతేకాదు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ల నిర్మాణాలను నిమిత్తం ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుంది ఇంకా దివ్యాంగులను సైతం వాళ్లలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి వాళ్లని ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండేలాగా పదిమందికి ఉపాధి కల్పించేలాగా పెట్టుబడుదారులుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అంతేకాదు మహిళలకు సరైనటువంటి భద్రత ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది కాబట్టి జనసేన అధికారంలోకి వస్తే మహిళలకు అత్యంత సామాజిక భద్రతలతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తాము అని మన మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానాన్ని రూపొందించి పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లి మన యొక్క ఆర్థిక వ్యవస్థను పురోగతిలో నడిపించి తద్వారా మనం మన రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించే దిశగా పనిచేయడం జరుగుతుంది జనసేనకు ఒక్కసారి అవకాశం ఇస్తే వ్యవస్థలను దాడిలో పెట్టి దృణతరం చేయడం జరుగుతుంది అని అనేక అంశాలు మన మేనిఫెస్టోలో షణ్ముఖవ్యూహం రూపంలోని తదితర అంశాల రూపంలోని ఉండడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని మన ప్రతి జనసైనికుడు ఆకలింపు చేసుకుని ఇంటింటికీ, వీధి వీధికి, గడప గడపకు, మనిషి మనిషికి, గుండె గుండెకు చేర్చాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని తెలియజేశారు అంతేకాకుండా ఈ రకంగా మనం ప్రజల్లోకి వెళితే ప్రజలందరూ మన పార్టీని విజయపధంలో నడిపించి మన అభ్యర్థిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి తద్వారా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి మన బాధ్యత నిర్వర్తించడం అవుతుందని తెలిపారు.

జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు మాట్లాడుతూ… జనసైనికులు అందరూ మనమంతా ప్రజా సమస్యలను మరింత బలంగా ఎలుగెత్తి పోరాడాలి వాటి పరిష్కారానికి మనమంతా కృషి చేయాలి దాని ద్వారా మనమందరం స్థానికంగా బలమైన నాయకులుగా అంతేకాదు అధికార పార్టీలో ఉన్న నాయకులు కంటే అధికారులు మనకే పనులు బాగా చేస్తారు దానితో ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించగలుగుతాం ఆ రకంగా మనం ప్రజాదరణను కూడగట్టుకోగలం అంతేకాదు ఈరోజుకి నేను మా స్వగ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా నేనే స్పందించి వాళ్ళ పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అధికార పార్టీని మానేసి నన్ను మాత్రమే ఆశ్రయిస్తారు కారణమేంటంటే ప్రజా సమస్యల మీద మనం చూపిన అంకితభావం ఈ క్రమంలో మనం ఎన్నో కేసులను ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ తిరిగి వాళ్ళ మీదే మనం కేసులు పెట్టి వాళ్ళ చేసిన తప్పులను అక్రమ కేసులను వాళ్ల దృష్టికి తీసుకొచ్చి తిరిగి దారిలో మనం పెట్టొచ్చు అలా నేను పెట్టి మా గ్రామంలో ఇవాళ జనసేన పార్టీని విజయ పదంలో నడిపించే దిశగా పైన సాగిస్తున్నాను కాబట్టి జనసేన శ్రేణులు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని అవలంబించి తగిన ప్రజాదరణను పార్టీకి కూడగట్టవలసిందిగా కోరుచున్నాను అని తన యొక్క భావాలను జనసైనికులకు పంచుకోవడమే కాకుండా నిజానికి దేశం కూడా చేయడం జరిగింది.

జనసేనకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు ఎద్దు చినబాబు మాట్లాడుతూ… నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే వెంకీ మరియు కార్యదర్శి రామకృష్ణ ని సంప్రదించి వారి ద్వారా ఇన్చార్జి నేతృత్వంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా నాతోపాటుగా అనేకమంది ఈ రోజుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా అందరికీ ఒకటే ఆదర్శం అది పవన్ కళ్యాణ్ గారి భావజాలం అందువల్లనే ఈ రోజున ఈ సమావేశం జరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో నా ఆధ్వర్యంలో మరింత మంది దళితులు పార్టీలో చేరడానికి సంసిద్ధులై ఉన్నారు. మరో మంచి సందర్భంలో భారీ స్థాయిలో మా దళిత సోదరులు ఈ నియోజకవర్గము నుండి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి ఎంతలాగా ప్రాధాన్యతనిస్తూ గౌరవించినటువంటి ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ వరుపుల తమ్మయ్య బాబు, కార్యదర్శి నల్లల రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి శేషారావు, మండల అధ్యక్షుడు శేఖర్ తదితరులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.

కొత్తగా జాయిన్ అయిన సభ్యులు మాట్లాడుతూ… అంబేద్కర్ భావజాలాన్ని ఈ రాష్ట్రంలో సాధించేటువంటి ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ అని బలంగా నమ్మి ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో దళితుల అభ్యున్నతికై జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కృషి చేస్తామని తెలియజేయడం. ఈ రకంగా సాగినటువంటి ఈ సమావేశంలో జై జనసేన జై జనసేన భారత్ మాతాకీ జై జై హింద్ వంటి నినాదాలతో సభ మొత్తం కోరెత్తింది అంతేకాదు ఎంతో సందడిగా జరిగిన ఈ సమావేశం ప్రారంభం మాత్రమే అని సభికులందరూ కూడా అభిప్రాయపడటం జరిగింది.