కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం

• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• ప్రమాదాల్లో మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కుల అందజేత
• 11 కుటుంబాలకు రూ. 55 లక్షలు అందచేసిన శ్రీ పవన్ కళ్యాణ్

‘ఆపత్కాలంలో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఆలోచనతోనే క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా చేయించాం. జనసేన పార్టీ ఒక కుటుంబం, ఆ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడి’నే అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా చేయని విధంగా కార్యకర్తలకు అండనిచ్చే పార్టీగా జనసేన నిలిచిపోయిందన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం ఎదురైనా అండగా ఉంటామని చెప్పారు. శనివారం కాకినాడలో ఇటీవల కాలంలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున రూ. 5 లక్షలు చొప్పున బీమా చెక్కులు అందచేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మొత్తం 11 కుటుంబాలకు రూ. 55 లక్షల మొత్తాన్ని అందించారు. మృతులు పార్టీకి చేసిన సేవలను అడిగి తెలుసుకున్నారు. మృతికి కారణాలు తెలుసుకుని వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ ఎలిబండి రమణ, అనపర్తి నియోజకవర్గానికి చెందిన శ్రీ కొరిపి రాజేష్, రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ కర్రి అర్జునరావు, ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన శ్రీ మల్లాడి నూకరాజు, శ్రీ మట్టా రాంబాబు, రాజోలు నియోజకవర్గానికి చెందిన శ్రీ మిరియాల రాంబాబు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన శ్రీ పల్లా శ్రీనివాసరావు, కొత్తపేట నియోజకవర్గానికి చెందిన శ్రీ చోడపనీడి దుర్గావంశీ, మండపేట నియోజకవర్గానికి చెందిన శ్రీ మాచర్ల మణికంఠ, రాజమండ్రి రూరల్ కి చెందిన శ్రీ సుంకర వీరబాబు, జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన శ్రీ అమర సూర్యప్రకాశ రావుల కుటుంబాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి రూ. 5 లక్షల చెక్కులు స్వీకరించాయి. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ తోట సుధీర్, శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, శ్రీ పొలిశెట్టి చంద్రశేఖర్, శ్రీ బండారు శ్రీనివాసరావు, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, శ్రీ తుమ్మల రామస్వామి, శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ వై. శ్రీనివాస్, శ్రీ రత్నం అయ్యప్ప, శ్రీ గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, శ్రీ పెదకాపు, శ్రీ మద్దా చంటిబాబు, శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి పి.సరోజ, శ్రీమతి ముత్యాల జయలక్ష్మి, శ్రీమతి కడలి ఈశ్వరి, శ్రీమతి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *