మంచి నీటి సమస్య తీరేది ఎప్పుడు..?

  • పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండేదేప్పుడు..?
  • ఎన్ని ప్రభుత్వాలు మారిన, అధికారులు మారిన మంచినీటి సమస్య తీరకపొడానికి కారణం ఏంటి?
  • పార్వతీపురం మున్సిపాలిటీ మంచి నీటి సమస్య తీరాలంటే జనసేన అధికారంలోకి రావలసిందే
  • పార్వతీపురం మున్సిపాలిటీ కమిషనర్ ని కలిసి మంచి నీటి సమస్య పై పట్టణ ప్రజలకు వివరణ ఇవ్వండి అని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: మున్సిపాలిటీలో త్రాగు నీటి సమస్యపై ప్రజలకు వివరణ ఇవ్వాలి అని మున్సిపల్ కమిషనర్ ను జనసేన పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా గురువారం జనసేన పార్టీ నాయకులు చందక అనీల్, రాజానా రాంబాబు, నెయ్యిగాపుల సురేష్, మానేపళ్లి ప్రవీణ్, కొల్లిపర తేజ, కడగల చంద్ర శేఖర్ మాట్లాడుతు.. పార్వతీపురం మున్సిపాలిటీలో త్రాగు నీటి సమస్య అనేది గత 20 సంవత్సరాలుగా ఉంది. వర్షాకాలం రాగానే ఇక్కడ ప్రజలు త్రాగేది మంచి నీరు కాదు బురద నీరు అనే విషయం అప్పటి నుంచి ఇప్పుడు వరుకు ఉన్న పాలకులకు, అధికారులకు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ గడిచిన ఇన్ని సంవత్సరాలలో ఈ సమస్య తీరలేదు. ఏ అధికారులు నాయకులు కూడా దీనిపై ఏటువంటి స్పష్టత పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వలేదు. అలాగే 15 సంవత్సరాల క్రితం ప్రతిరోజూ వచ్చిన కుళాయిలు ఇప్పుడు రోజు తప్పించి రోజు రావడానికి కారణాలు ఏంటి..? నాగావళి నది పక్కనే ఉన్న పార్వతీపురం ప్రజలకు ఈ మంచినీటి కష్టాలు దేనికి..? ఎందుకు..? ఈ రెండు అంశాలు పై ప్రజలందరికీ నిజాలు తెలియజేయండి అని అన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఈ మంచి నీటి సమస్య తీర్చే విధంగానే పనులు చేపట్టాం అని అలాగే ఫండ్స్ కొరత ఉండటం వలన పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్య పూర్తిగా పరిష్కరిస్తామని వివరణ ఇచ్చారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే అని, పార్వతీపురం మున్సిపాలిటీ మంచినీటి సమస్య తీరాలంటే జనసేన ప్రభుత్వం రావలసిందే అని జనసేన పార్టీ నాయకులు అన్నారు.