పూర్తి పరిజ్ఞానం లేని వైసీపీ మంత్రులకు అందించినట్లే అందరికీ ‘స్క్రిప్ట్’ అందిస్తారా..?

*శ్రీ పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారు
* పరిపాలన గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ ఎవరితో, ఏం మాట్లాడారోనని మంత్రులు ఎందుకు
ఆవేదన చెందుతున్నారు..?
* జనసేన ప్రభుత్వంలో అన్ని లెక్కలూ బయటికి తీస్తాం

పూర్తి పరిజ్ఞానం కూడా లేని కొందరు వైసీపీ మంత్రులకు పార్టీ మారినప్పుడల్లా ఆయా పార్టీలు స్క్రిప్ట్ అందించినట్లే అందరికీ ‘స్క్రిప్ట్’ అందిస్తారు అనే భ్రమలో ఉండి మాట్లాడుతున్నట్టు ఉన్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు ఒక ప్రకటనలో చురకలు అంటించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారు. జనసేనలో ఎవరికీ ‘స్క్రిప్ట్’లు అందించాల్సిన అవసరం లేదు. పార్టీలో గ్రామీణ స్థాయిలో ఉన్న అతి సామాన్య జన సైనికులు, వీర మహిళలు కూడా తమకున్న సామాజిక అవగాహనతో స్వంత పరిజ్ఞానంతో మాట్లాడతారు. అయినా పరిపాలన గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఎవరితో, ఏం మాట్లాడారోనని మంత్రులు ఎందుకు ఆవేదన చెందుతున్నారో వారికే తెలియాలి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న గౌరవంతో ఆయనను ఆహ్వానించి మర్యాదపూర్వకంగా మాట్లాడిన మాటలు కూడా విడమరచి చెప్పాలని వైసీపీ మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో కూడా వారికే అర్థం కావాలి.
* ‘జే-గ్యాంగ్’ అవినీతి లెక్కలు ఇవిగో..
అధికారం చేజిక్కించుకున్న దగ్గర నుంచి జగనన్న “జే-గ్యాంగ్” చేసిన అవినీతి లెక్కల వివరాలు అన్నీ జనసేన ప్రభుత్వం స్థాపించిన తరువాత బయటికి తీస్తాం. ప్రస్తుతానికి జగనన్న కాలనీల పేరుతో “జే-గ్యాంగ్” దోచుకున్న దోపిడీ మొత్తం రూ.15,191 కోట్లు వివరాలు ప్రజల ముందు ఉంచుతున్నాం.
👉ఇళ్లస్థలాల కొనుగోలులో గోల్ మాల్ చేసి రూ.4 వేల కోట్లు దోచుకున్నారు.
👉జగనన్న కాలనీల లెవలింగ్, చదును పేరుతో రూ.2,631 కోట్లు దోచుకున్నారు.
👉జగనన్న కాలనీల్లో ఇసుక సరఫరా పేరుతో రూ. 3,100 కోట్లు దోచుకున్నారు.
👉జగనన్న కాలనీల్లో సిమెంటు పేరుతో రూ.2,100 కోట్లు దోచుకున్నారు.
👉జగనన్న కాలనీల్లో ఇనుము పేరుతో రూ.1860 కోట్లు దోచుకున్నారు.
👉జగనన్న కాలనీల పక్కన వై.సీ.పీ. నేతలు రియల్ ఎస్టేట్ పేరుతో రూ.1500 కోట్లు దోచుకున్నారు.
👉జగనన్న కాలనీల పేరుతో జనావాసాలకు 10 కిలో మీటర్ల పరిధిలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని కొండలు, గుట్టలు, లోతట్టు భూములను నాలుగైదు రెట్లు అధికంగా ధర చెల్లించి బినామీ పేర్లతో కొనుగోలు చేయడం ద్వారా రూ.4వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారు.
👉ఇళ్ల స్థలాల లెవలింగ్, చదును చేయడానికి సంబంధించి 5-7-2020 న రూ. 2,631.70 కోట్లు నరేగా నిధులను మంజూరు చేయగా, ఈ నిధుల్లో భారీఎత్తున అవినీతి చోటుచేసుకుంది.
👉ఇళ్లస్థలాలు లెవెలింగ్ కు అవసరమైన గ్రావెల్ ను సంబంధిత లే అవుట్ కు 5 కిలోమీటర్ల లోపు నుంచి తరలించాలన్న నిబంధనను కాంట్రాక్టర్ల కోసం సవరించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు.
👉నిబంధనలకు విరుద్ధంగా జెసిబిలు, ట్రాక్టర్లతో లెవలింగ్ పనులు నిర్వహించారు. మైనింగ్ శాఖ అనుమతులకు బదులు ఎమ్మార్వోల ద్వారా అనుమతి పొంది జెసిబిలు, ట్రాక్టర్లతో గ్రావెల్ ను తరలించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు.
👉జగనన్న కాలనీలో తొలివిడత నిర్మించే ఇళ్లకు అవసరమైన 3.10 లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, ఎక్కడా ఉచితంగా సరఫరా చేయడం లేదు. ఈ కారణంగా టన్ను ఇసుక రూ. 675/- పెట్టి కొనుగోలు చేయాల్సివస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులతో సహా టన్నుకు వెయ్యి రూపాయల చొప్పున రూ. 3,100 కోట్లు అదనపు భారం పడింది.
👉ముఖ్యమంత్రి జగన్ భారతి సిమెంట్స్ కు లబ్ధి కలిగించడానికి మిగతా సిమెంటు కంపెనీలతో కుమ్మక్కయి సిమెంటు ధరలను అమాంతంగా పెంచేయడం వల్ల టన్నుకు రూ. 3 వేలు చొప్పున రూ. 2,100 కోట్లు అదనపు భారాన్ని లబ్ధిదారులు మోయాల్సి వస్తోంది.
👉తొలివిడత గృహనిర్మాణాలకు 7.44లక్షల మెట్రిక్ టన్నుల ఇనుము అవసరం కాగా, గతంలో టన్ను ఇనుము ధర రూ. 45 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 70 వేలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల లబ్ధిదారులపై రూ.1860 కోట్ల మేర అదనపు భారం పడింది.
👉మొత్తంగా జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో రూ. 13,690 కోట్లు, సమీపంలో వై.సీ.పీ. నేతల రియల్ ఎస్టేట్ ద్వారా మరో 1500 కోట్లు దోచుకున్నారు.
👉ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఖర్చవుతుండగా, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.8 లక్షలు మినహా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనపు సాయం అందించడం లేదు అని శ్రీ నాగబాబు వివరించారు.