వైసీపీ రాక్షస పాలన అంతానికి మహిళలు సిద్ధమవ్వాలి

  • రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదు
  • ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.
  • మహిళా శక్తి ఏమిటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తాం.
  • ఆడబిడ్డలకు రక్షణ, దిక్కు పవన్ కళ్యాణ్ మాత్రమే
  • మహిళా సాధికారత జనసేనతోనే సాధ్యం.
  • కృష్ణ – పెన్నా రీజనల్ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు.

గుంటూరు, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ఆరాచకశక్తులకు అడ్డాగా మారిందని , రాష్ట్రం నలుదిక్కులా రాక్షస మూకలు చేరి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసారని , వైసీపీ రాక్షస పాలనను అంతం చేయటానికి మహిళలంతా సిద్ధమవాల్సిన సమయం ఆసన్నమైందని కృష్ణా – పెన్నా రీజనల్ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు అన్నారు. శుక్రవారం గుంటూరులోని నాగార్జున హోటల్ లో జరిగిన జిల్లా వీరమహిళల సదస్సుకి ఆమె ప్రాతినిధ్యం వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. పార్వతి నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆడబిడ్డల్ని రక్షించటంలో , వారికి భద్రత కల్పించటంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ముఖ్యమంత్రికి కనపడటం లేదా? మహిళలు ఆర్తనాదాలు వినపడటం లేదా? అని ప్రశ్నించారు. మహిళా నాయకురాలు రావి సౌజన్య మాట్లాడుతూ తల్లిని, చెల్లిని రోడ్డుపాలు చేసినోడు రాష్ట్ర మహిళల్ని పట్టించుకుంటాడా అని ఆవేదన వ్యక్తం చేశారు. వీర మహిళ అనే పేరుని సార్ధకం చేసేలా ప్రతీ మహిళా ఒక శక్తిగా మారి జనసేనకు వెన్నుదన్నుగా నిలిచి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించకూడదని కృష్ణ రీజనల్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో మహిళలు ధైర్యంగా తిరగాలి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం ఒక్కటే మార్గమని మహిళా నేత లక్ష్మీ సరస్వతి అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలన అభివృద్ధి శూన్యం, అప్పులు ఘనంగా సాగుతోందని విమర్శించారు. సాధారణ మరణాలను సైతం ఉపయోగించుకొని ఓదార్పు యాత్ర చేసిన జగన్ రెడ్డికి పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను విమర్శించే హక్కులేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్ మాట్లాడుతూ స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయటం మూర్ఖత్వమని, జగన్ రెడ్డి పాలన అంతానికి మహిళలు మహాశక్తిగా 2024 లో అవతరించనున్నారన్నారు. రాష్ట్ర నాయకులు వడ్రాణం మార్కండేయులు మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు జనసేన పెద్దపీట వేయనుందన్నారు. చేనేత విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని వైసీపీ నేతలు నిర్వీర్యం చేశారని, ఈ రాష్ట్రాన్ని అన్ని కాపాడుకోవటానికి పవన్ కల్యాణ్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదని, అలాంటి ఆడబిడ్డల్ని కాపాడుకోకపోతే భవిష్యత్ ఉండదన్నారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన మహిళలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభ అనంతరం జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన మహిళా కార్పొరేటర్లను, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామ సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్, వీరమహిళలు బిట్రగుంట మల్లిక, మల్లెల దుర్గాకుమారి, కమతం విజయకుమారి, బడే కోమలి, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, లక్ష్మీ దుర్గ, లలిత కుమారి, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తదితరులు పాల్గొన్నారు.