మహిళా సాధికారత జనసేనతోనే సాధ్యం

మహిళా సాధికారత, స్వావలంబన సాధించాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని కుటుంబాలను సమర్థంగా నడిపే ఆడపడుచులు సమాజాన్ని నడపలేరా? అంటూ మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టే జనసేనాని మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానాన్ని కల్పించటంలో జనసేన ఎప్పుడు ముందుంటుంది. అక్కచెల్లెళ్లతో కలిసి పెరిగిన వాడిని కనుక తనకు మహిళల కష్టాలు బాగా తెలుసని, కష్టమైనా, నష్టమైనా జనసేన పార్టీ మహిళలకు అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటారు. మహిళలకి సంబందించి, మహిళలకు ఎదురైన సమస్యలు ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాల కమిటీ పర్యవేక్షిస్తుంది.
ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళాసాధికారతలో ప్రస్తావింపబడ్డాయి. స్వశక్తిపై విశ్వాసాన్ని ఆభివృద్ధిపరచడం కూడ సాధికారతలో కలిసి ఉంటుంది. సాధికారత దాదాపుగా క్రింది అంశాలతో లేదా అదే సామర్ధ్యాలతో ఉంటుంది.

స్వయం నిర్ణయాత్మక శక్తిని కల్గి ఉండడం.

తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారం మరియు వనరులు అందుబాటులోకి తెచ్చుకోవడం.

అవును/కాదు, ఇదిగాని/అదిగాని వంటి మాటలు గాక తమ పరిధి మేరకు ఇష్టాలను ఎంచుకోవడం.

సాముదాయిక నిర్ణయంలో నిస్సందేహమైన ఖచ్చితత్వాన్ని కలిగి ఉండడం.

మార్పుకనుగుణమైన సానుకూల దృక్పథాన్ని పొందగలగడం.

వ్యక్తిగతంగాను లేదా సామూహికశక్తిగాగల నైపుణ్యాల సామర్ద్యాలను మెరుగుపరచుకోవడం.

ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఇతరుల గ్రహణశక్తిని మార్చే సామర్ధ్యాన్ని కల్గి ఉండడం.

ఎదుగుదల ప్రక్రియలో, నిరంతర మార్పులకు, స్వయం ప్రేరకంగా కలిసిపోవడం.

అనుకూల వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం, అపవాదాల నుంచి అధిగమించడం.

జనసేన పార్టీలో మహిళా శక్తికి ప్రాముఖ్యత ఇచ్చే క్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారంలో ఉన్నవారు మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తుంటే జనసేన పార్టీ మాత్రం వారికి సముచిత స్థానం ఇస్తూ, గౌరవం ఇస్తూ ముందుకు వెళ్తుంది.

ఎప్పటికప్పుడు జనసేన పార్టీ అనేక అంశాలపై ప్రముఖ వ్యక్తులతో మహిళలు రాజకీయాల్లో ఎలా అభివృద్ధి చెందాలి, మహిళల రక్షణ వంటి అనేక అంశాలపై శిక్షణ ఇస్తుంటారు. పార్టీ లో ఉన్న వీరమహిళలు కూడా స్త్రీల సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. దిశా చట్టం ఉన్న ఆడవారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని, ప్రభుత్వంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను, దురాగతాలను ఖండించడానికి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై తగిన ప్లానింగ్ తో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణగా ముందుకు వెళ్లాలని వీరమహిళలు నిర్ణయించుకున్నారు.

ఆడపిల్లల హక్కులు కాపాడటంతో పాటు సామాజిక, ఆర్థిక సాధికారతను అందించాలి. ఆడపిల్లల స్థితిని మెరుగుపరచడంలో కుటుంబ పాత్రను బలోపేతం చేయాలి. మహిళా శక్తిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. కేంద్రం శాస్త్ర సాంకేతిక రంగానికి స్థూల జాతీయ ఉత్పత్తిలో తగినన్ని నిధులు కేటాయించాలి. పితృస్వామ్య సమాజం విధించిన అనేక కట్టుబాట్లను ఛేదించుకొని ఇప్పుడిప్పుడే సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళకు సమాజం చేయూత ఇవ్వవలసిన అవసరం ఉంది. అలాగైతేనే రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వం ఆచరణలో వీలవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళ అజేయంగా రాణించడానికి బాటలు పడతాయి.

మహిళా సాధికారత విషయంలో జనసేన పార్టీ ఎప్పుడు మహిళల తరుపున నిలబడుతుంది.