జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయండి

  • రాజంపేట జనసేన నేతలు తాళ్లపాక శంకరయ్య, మల్లెం నరసింహులు

రాజంపేట: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన కోనేటి హరి వెంకటరమణ విజయానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలుఅందరూ కలిసి కృషిచేయాలని రాజంపేట జనసేన నేత తాళ్లపాక శంకరయ్య పేర్కొన్నారు. శనివారం రాజంపేట మండల పరిధిలోని హత్యరాల గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ.. జనసేన మద్దతుతో హరి వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టభద్రుల సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన తప్పకుండా పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు తాళ్ల పెద్ద పెంచలయ్య, చిన్న పెంచలయ్య, జనసేన వీరమహిళల రేవతి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.