ప్రపంచపర్యావరణ దినోత్సవం: మొక్కలు నాటిన జ్యోతుల శ్రీనివాసు మరియు జనసైనికులు

పిఠాపురం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిఠాపురం మండలం, పి రాయవరం గ్రామంలో సీతరామ ఆలయం పరిసరాలలో మరియు గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో తుమ్మచెరువు గట్టు పరిసరాలలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కొబ్బరి, సుబాబుల్, వేప, రావి, గానుగు మొక్కలు నాటిన సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రపంచం ప్రస్తుతం పర్యావరణ సమస్యలతో బాధపడుతున్న తరుణంలో ప్రజలు అందరు జాగురతతో మనం నివాసించే ప్రాంతాలలో మొక్కలను నాటి మహవృక్షాలుగా, వనాలుగా మార్చుకొంటే రాబోయే రోజుల్లో పర్యావరణ కాలుష్యం చెప్పుకొదగిన స్థాయిలో తగ్గుందని తెలియ జేశారు. జ్యోతుల శ్రీనివాసు పి రాయవరం గ్రామ ప్రజలను, జనసైనికులను మరియు దుర్గాడ గ్రామ ప్రజలను, జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మొక్కలను ప్రభుత్వ స్థలాలలో తమ గ్రామాలలో రాబోయే తొలకరి సమయంలో నాటి, మొక్కలకు నీరు పోయించి పెంచడం నా బాధ్యత కాని మొక్కలకు సామాజిక భద్రత మీరందరూ తీసుకొవాలి. రాబోయే తోలకరిలొ పి రాయవరం దుర్గాడ గ్రామంలో గల అన్ని చెరువుల గట్టులపైసామాజిక స్థలాలలో సామజిక బాధ్యతతో ఫలసహయంతో కూడిన కొబ్బరి మొక్కలు నాటిస్తే పి రాయవరం, దుర్గాడ గ్రాపంచాయతీలకు ప్రతి సంవత్సరం కొబ్బరి మొక్కలు ఆదాయం వస్తుంది, దీని కారణంగా పంచాయతి ఆదాయం పెరుగుతుందని మరియు పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఏర్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కారిపిరెడ్డి వెంకటేష్,
కురాకుల వాసు, మాదిపల్లి దుర్గప్రసాద్, కందా అరవిందు, పిన్నం మహేష్, యండపల్లి వీరబాబు, కొత్తెం వీరబాబు, పిన్నం సతీష్, పినపాత్రుని అజేయ, కురాకుల శంకర్, దేశిలింక శేఖర్, అయినాల సురేష్, మేడిబోయిన శ్రీను, సాదనాల చంటిరాము, చేశెట్టి భద్రం, అయినవిల్లి శ్రీను, పెదపాటి అప్పలస్వామి, కీర్తి చిన్నా,అయినవిల్లి రాజా, జ్యోతుల గోపి, జ్యోతుల వాసు, కొలా నాని, నానబోయన వీరబాబు, కీర్తి చిన్న తదితరులు పాల్గొన్నారు.