నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల చేసిన వై కోట జనసేన

రైల్వేకోడూరు, 2022 వ నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని వై కోట గ్రామం జనసేన టీం సభ్యులు మరియు వై కోట ఎన్ఆర్ఐ సేవా సమితి సభ్యులు కలసి నూతన సంవత్సర క్యాలెండరును జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర స్వగృహమునందు రైల్వేకోడూరు స్థానిక జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబుతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ పార్టీ క్యాలెండర్ లో జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతిబింబిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంట్లో జనసేన పార్టీ రాష్ట్రంలోని రైతులకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగస్తులకు, బడుగు బలహీన వర్గాలకు సమాజంలోని అన్ని రకాల ప్రజలకు చేసే సేవల గురించి విపులీకరించారన్నారు. అంతేకాకుండా ధన, ప్రాంత, కుల, మత రహితఓగా క్యాలెండరరును మంచి సామాజిక స్పృహతో రూపొందించారని వై కోట జనసేన టీం యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇలాంటి క్యాలెండర్ను విడుదల చేసేందుకు సహకరించిన వై కోట జనసేన టీం యువకులకు మరియు ఎన్ఆర్ఐ సేవా సమితి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తాతఒశెట్టి నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లంశెట్టి కిషోర్, చేవాకుల రెడ్డిమణి, కె. చెంగల్రాయుడు ఆచారి, నల్లంశెట్టి నరసింహ, కొండేటి మనోజ్, సాయం విద్యాసాగర్, పటం రవి, ఆవుల గణేష్, నల్లంశెట్టి బాబు, నల్లంశెట్టి చందు తదితరులు పాల్గొన్నారు.