ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 34వ రోజు పాదయాత్ర

ఏలూరు: ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా 7వ డివిజన్ లోని బెనర్జీపేటలో రెడ్డి అప్పల నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. ఈ డివిజన్ లోని ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా పోయిందని, ప్రజలపైన పన్నుల భారం వేస్తున్నారు. కరెంట్ బిల్ పెంచారు. ఇంటి పన్ను పెంచారు. నిత్యవసరాల ధరలు ఆకాశమంటాయి. ఎక్కడ పారిశుధ్యం లేదు. పరిశుభ్రమైన వాతావరణం లేదు. కుంటి సాకులు చెప్పి కరెంటు బిల్లు పెంచి వేస్తూ పెన్షన్లు సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయో అనే ఆలోచనతో ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యేకి మూడుసార్లు అవకాశం ఇచ్చామని కానీ ఈ ఎమ్మెల్యే పట్టించుకునే పరిస్థితిలో లేడని పైపైన ఏదో తిరుగుతున్నారని ప్రజల సమస్యలు తీర్చలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ లేనటువంటి పాలకవర్గం ఈరోజున నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మున్సిపల్ అధికారులు అదేవిధంగా కార్పొరేషన్ మేయర్ వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారని మీరు పబ్లిక్ సర్వెంట్లని వాళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు ప్రజలే గుణపాఠం చెప్తారని ఈ విధంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కూనిశెట్టి మురళి, సరళ, కోశాధికారి పైడి లక్ష్మణరావు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చిత్తరి శివ, కోలా శివ నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, వేముల బాలు, పొన్నూరు రాము స్థానిక నాయకులు పండు, రాజు వీర మహిళలు కోలా సుజాత, తుమ్మపాల ఉమాదుర్గ, ప్రమీల రాణి, దుర్గా బి మరియు 7వ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..