సమకాలీన రాజకీయాలపై గేయ కవిత్వం ‘శాస్త్రాలు’ పుస్తకావిష్కరణ

•తెనాలిలో పుస్తకాన్ని ఆవిష్కరించిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
నేటి సమకాలీన రాజకీయాలపై, సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలపై తెనాలికి చెందిన కవి డాక్టర్ రంగిశెట్టి రమేష్ రచించిన శత గీతావళి ‘శాస్త్రాలు’ గేయ కవిత్వ రచనల పుస్తకాన్ని శుక్రవారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలిలో ఆవిష్కరించారు. ఏడాది పాటు ఈ గేయ కవిత్వంపై దృష్టి నిలిపి పూర్తి చేసినట్లు రచయిత డాక్టర్ రంగిశెట్టి రమేష్ తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాలు పడుతున్న వేదనలను, రాజకీయ కుతంత్రాలు, వివిధ వ్యక్తుల వ్యవహార శైలిపైన ఈ రచన సాగిందన్నారు. ఈ రచనను మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎమ్.వెంకయ్య నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా శాస్త్రాలు కవిత్వంలోని కొన్ని పంక్తులను శ్రీ మనోహర్ గారి సమక్షంలో చదివి వినిపించారు. త్వరలోనే జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంపై రచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ మనోహర్ గారు అభినందనలు తెలియజేశారు.
•వెయిట్ లిఫ్టర్ జ్ఞాన దివ్యకు అభినందనలు
ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన అంతర్జాతీయ సబ్ జూనియర్ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ చూపిన తెనాలి మండలం, కట్టేవరం గ్రామానికి చెందిన నాగం జ్ఞానదివ్యను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అభినందించారు. ఇటీవల జరిగిన పోటీల్లో నాగదివ్య మంచి ప్రదర్శన చేసి 84 కేజీల కేటగిరిలో రెండు కాంస్య పతకాలను కైవశం చేసుకున్నారు. నాగ దివ్యతోపాటు ఆమె తండ్రి శ్రీ వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు ఆమె ఆట తీరును అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కేరళలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయస్థాయిలో మూడు బంగారు పతకాలను సాధించడంతోపాటు జాతీయ స్థాయి రికార్డులను జ్ఞాన దివ్య అధిగమించడం, ఇస్తాంబుల్ లో పతకాలు దక్కించుకున్నందుకు ఆమెకు శుభాభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ భారతదేశం పేరును నిలబెట్టేలా ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *